చెన్నైలోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 37 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్‌ పీజీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిభ్రవరి 1,2వ తేదీలలో  ఇంటర్వ్యూకి హాజరు కావొచ్చు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 37


పోస్టుల కెటాయింపు: జనరల్- 08, ఓబీసీ- 04, ఎస్సీ- 11, ఎస్టీ- 12, ఈడబ్ల్యూఎస్- 02. 


* సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు


పోస్టుల వారీగా ఖాళీలు..


➥ అనాటమీ: 01


➥ కమ్యూనిటీ మెడిసిన్: 02


➥ బయోకెమిస్ట్రీ: 01


➥ పాథాలజీ: 01


➥ జనరల్ మెడిసిన్ + ఐసియు/ఎంఐసియు(మెడ్) & ఐసిసియు (మెడ్): 07


➥ రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(RICU): 03


➥ డెర్మటాలజీ + స్కిన్ & VD: 01


➥ పీడియాట్రిక్స్ + నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(NICU) & పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(PICU) (Paed): 01


➥ ఆర్థోపెడిక్స్: 02


➥ ఒటోరినోలారింగాలజీ / ఈఎస్‌టీ: 01


➥ ఒబెస్ట్ట్రిక్స్ గైనకాలజీ + ఒబెస్ట్ట్రికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(OICU): 04


➥ అనస్థీషియా: 01


➥ రేడియో నిర్ధారణ: 05


➥ ఎమర్జెన్సీ మెడిసిన్: 05


➥ ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్: 02


అర్హత: మెడికల్‌ పీజీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 45 సంవత్సరాల లోపు ఉండాలి.


పదవీకాలం: 3 సంవత్సరాలు.


దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళ & ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


జీతం: రూ.67,700. 


ఇంటర్వ్యూకి వెంట తీసుకురావల్సిన సర్టిఫికేట్‌లు..


⏩ ఐడెంటిటీ ప్రూఫ్(పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ మొదలైనవి) తీసుకెల్లాలి.


⏩ అడ్రస్ ప్రూఫ్(రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్ మొదలైనవి) తీసుకెల్లాలి.


⏩ పుట్టిన తేదీని ద్రువపరిచే సర్టిఫికెట్(10వ తరగతి సర్టిఫికేట్/బర్త్ సర్టిఫికేట్) తీసుకెల్లాలి.


⏩ ఇటీవలి రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెల్లాలి.


⏩ ఆధార్ కార్డ్/పాన్ కార్డ్ మరియు బ్యాంక్ పాస్‌బుక్ యొక్క ఫోటోకాపీలు(ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే చేరే సమయంలో)


⏩ 10వ & 12వ తరగతి మార్కు షీట్లు లేదా సర్టిఫికెట్లు వెంట తీసుకెల్లాలి.


⏩ ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ మరియు NMC మార్గదర్శకాల ప్రకారం వర్తించే ఎక్స్‌పీరీయన్స్ సర్టిఫికేట్ తీసుకెల్లాలి.


⏩ మెడికల్ అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్ / స్టేట్ మెడికల్ కౌన్సిల్‌ నమోదు చేసుకోవాలి.


⏩ ఎంపిక తర్వాత, అభ్యర్థి చేరిన సమయంలో నమోదు చేయకపోతే, చేరిన తేదీ నుండి 30 రోజుల తర్వాత కాకుండా తమిళనాడు స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి.


⏩ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన సర్టిఫికేట్.


⏩ భారత ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మాట్‌లో రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికెట్(ఓబీసీ(ఎన్‌సీఎల్)*/ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/ఈడబ్ల్యూఎస్)

ఇంటర్వ్యూ తేదీలు: 01.02.2024, 02.02.2024.


రిపోర్టింగ్ టైమ్: ఉదయం 09.00.


క్లోజింగ్ టైమ్: ఉదయం 11.00. 


ప్రదేశం: ESIC Medical College & Hospital, K.K. Nagar, Chennai.


Notification


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..