యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఛైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త మనోజ్‌ సోనీ మే 16న ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. 2017 జూన్‌ 28న యూపీఎస్సీలో సభ్యుడిగా చేరిన ఆయన.. గతేడాది ఏప్రిల్‌ 5 నుంచే యూపీఎస్సీ తాత్కాలిక ఛైర్మన్‌ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 16న మనోజ్‌ సోనీతో కమిషన్‌లోని సీనియర్‌ సభ్యురాలైన స్మితా నాగరాజ్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారని సిబ్బంది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యూపీఎస్సీలో సభ్యుడు కావడానికి ముందు మనోజ్ సోనీ మూడుసార్లు పలు యూనివర్సిటీల్లో వీసీగా పనిచేశారు.


మనోజ్ ఉద్యోగ ప్రయాణం సాగిందిలా..


➛ 2009 ఆగస్టు 1 నుంచి 2015 జులై 31 వరకు గుజరాత్‌లోని డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వరుసగా రెండు పర్యాయాలు వీసీగా సేవలందించారు.


➛ అంతకముందు బరోడాలోని మహారాజా సాయాజిరావు యూనివర్సిటీలో ఏప్రిల్ 2005 నుంచి 2008 ఏప్రిల్ వరకు వీసీగా పనిచేశారు. 


➛ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో స్పెషలైజేషన్‌తో పొలిటికల్ సైన్స్‌లో స్కాలర్ అయిన సోనీ.. వీసీగా ఉన్న కాలం మినహా 1991 నుంచి 2016 వరకు గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో వల్లభ్ విద్యానగర్‌లోని సర్దార్ పటేల్ యూనివర్శిటీ‌లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాన్ని బోధించేవారు. 


➛ మహారాజా సాయాజీరావు వర్సిటీలో వీసీగా చేరినప్పుడు ఆయన అత్యంత పిన్న వయస్కుడైన వీసీగా రికార్డు నమోదు చేసుకున్నారు. 
అఖిలభారత సర్వీసులైన ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. యూపీఎస్సీలో ఛైర్మన్‌తో పాటు గరిష్ఠంగా 10 మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం దాదాపు ఐదుగురు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.


Also Read:


ఏఈఈ రాతపరీక్ష హాల్‌‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ) పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 21, 22 తేదీల్లో సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలకు సంబంధించిన పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మే 17 నుంచి పరీక్ష స‌మయానికి 45 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం వెబ్‌సైట్‌లో పరీక్షలకు సంబంధించి మాక్‌లింక్‌ అందుబాటుల ఉంది. 
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ హైకోర్టులో 84 కాపియిస్ట్ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.69 వేల వరకు జీతం!
తెలంగాణలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న కాపీస్ట్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 84 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్‌ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.72 వేల వరకు జీతం!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..