కాకినాడలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 12లోగా తమ దరఖాస్తులు సమర్పించాలి. అయితే పీడియాట్రీషియన్, గైనకాలజిస్టు, ఫిజీషియన్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు జనవరి 7 - 15 మధ్య డీఎంహెచ్‌వో(కాకినాడ) కార్యాలయంలో నిర్వహించే వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.


పోస్టుల వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 152    


➥ పీడియాట్రిషియన్: 10 పోస్టులు    


➥ గైనకాలజిస్టు: 05 పోస్టులు    


➥ ఫిజిషియన్/ కన్సల్టెంట్ మెడిసిన్: 02 పోస్టులు    


➥ మెడికల్ ఆఫీసర్: 48 పోస్టులు    


➥ మెడికల్ ఆఫీసర్ (డెంటల్ అసిస్టెంట్ సర్జన్): 03 పోస్టులు    


➥ క్లినికల్ సైకాలజిస్ట్: 02 పోస్టులు    


➥ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్: 01 పోస్టు   


➥ ట్యూబర్‌క్యులోసిస్(టీబీ) హెల్త్ విజిటర్: 02 పోస్టులు    


➥ సీనియర్ ట్యూబర్‌క్యులోసిస్ ల్యాబొరేటరీ: 03 పోస్టులు    


➥ స్టాటిస్టికల్ అసిస్టెంట్: 01 పోస్టు   


➥ ల్యాబ్ టెక్నీషియన్: 10 పోస్టులు    


➥ సపోర్టింగ్ స్టాఫ్/ సెక్యూరిటీ: 02 పోస్టులు    


➥ న్యూట్రిషన్ కౌన్సెలర్: 01 పోస్టు    


➥ స్టాఫ్ నర్సు: 39 పోస్టులు    


➥ కుక్ కమ్ కేర్ టేకర్: 01 పోస్టు     


➥ వార్డు క్లీనర్: 04 పోస్టులు    


➥ ఫిజియోథెరపిస్ట్: 02 పోస్టులు    


➥ సోషల్ వర్కర్: 03 పోస్టులు    


➥ డెంటల్ టెక్నీషియన్: 02 పోస్టులు    


➥ ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్: 03 పోస్టులు    


➥ ఆప్టోమెట్రిస్ట్: 01 పోస్టు    


➥ హాస్పిటల్ అటెండెంట్: 02 పోస్టులు    


➥ శానిటరీ అటెండెంట్: 01 పోస్టు    


➥ ఆడియో మెట్రికేషన్: 03 పోస్టులు    


➥ మేనేజర్ - క్యుఏ: 01 పోస్టు    


అర్హత: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంఫిల్, ఎంఎస్సీ, సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఇంటర్, బీఎస్సీ (న్యూట్రీషన్), జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్), పదోతరగతి, పీజీడిగ్రీ (సోషల్ వర్క్), ఆయుష్, బీపీటీ, ఎంబీఏ అర్హతలు ఉండాలి,  


వయోపరిమితి: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 15 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.    


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను డీఎంహెచ్‌వో(కాకినాడ) కార్యాలయంలో అందజేయాలి.    


ఎంపిక విధానం: ప్రభుత్వ నిబంధనల ప్రకారం.


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తులకు చివరితేదీ:  12.01.2023.    


➥ తుది మెరిట్ జాబితా వెల్లడి: 25.01.2023.    


➥ నియామక ఉత్తర్వుల జారీ: 28.01.2023.


Notification


Application


Website 


Also Read:


APPSC Group 2 Notification: గుడ్ న్యూస్, త్వరలో 'గ్రూప్-2' నోటిఫికేషన్! పోస్టులెన్నో తెలుసా?
ఏపీలోని ఉద్యోగార్థులు ఒకవైపు 'గ్రూప్-1' ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతున్న వేళ.. 'గ్రూప్-2' నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో గౌతమ్ సవాంగ్ తాజాగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే గ్రూపు-2 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 8న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. మూడు వారాల్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...