DMHO: ప్రకాశం జిల్లాలో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి

ఒంగోలులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డా. వైఎస్ఆర్ నెట్ వర్క్ హాస్పిటల్స్‌లో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Continues below advertisement

ఒంగోలులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలోని డా. వైఎస్ఆర్ నెట్ వర్క్ హాస్పిటల్స్‌లో ఆరోగ్య మిత్ర, టీం లీడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ బీఫార్మసీ/ ఫార్మా-డి/ బీఎస్సీ(మెడికల్ ల్యాబ్-టెక్నాలజీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

Continues below advertisement

వివరాలు..

మొత్తం ఖాళీలు: 19 

* ఆరోగ్య మిత్రాస్: 17 

అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ బీఫార్మసీ/ ఫార్మా-డి/ బీఎస్సీ(మెడికల్ ల్యాబ్-టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు తెలుగు, ఇంగ్లీషు చదవడం, మాట్లాడడం, రాయడం చేయాలి. ఎం.ఎస్.ఆఫిస్‌లో కంప్యూటర్ పరిజ్ఞానం మరియు సమర్థత కలిగి ఉండాలి. మెడికల్/సర్జికల్ స్పెషాలిటీస్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.12.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడిగింపుతో పాటు 3 సంవత్సరాలు, విభిన్న సామర్థ్యం గల వ్యక్తులు: 10 సంవత్సరాలు, అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు ఉంటుంది. 

జీతం: రూ.15000.

* టీం లీడర్స్: 02

అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్)/ ఎంఎస్సీ (నర్సింగ్)/ బీఫార్మసీ/ ఫార్మా-డి/ బీఎస్సీ(మెడికల్ ల్యాబ్-టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. 

అనుభవం: హాస్పిటల్ సర్వీసెస్‌లో కనీసం 2 సంవత్సరాల ఫుల్ టైం అనుభవం ఉండాలి.

స్కిల్స్: ఎక్స్‌లెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ కలిగి ఉండాలి. తెలుగు, ఇంగ్లీషు చదవడం, మాట్లాడడం, రాయడం చేయాలి. కష్టమైన మరియు సంక్లిష్టమైన పరిస్థితులను నిర్వహించగలగాలి. కంప్యూటరైజ్డ్ డేటా సేకరణ, మేనేజ్‌మెంట్, రిపోర్టింగ్ మరియు అనాలిసిస్ సిస్టమ్‌ పై అనుభవాలతో పాటు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మెడికల్/సర్జికల్ స్పెషాలిటీస్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.

అదనపు అర్హత: ఏదైనా పీజీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: 01.12.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: సాయుధ దళాలలో సర్వీస్ యొక్క పొడిగింపుతో పాటు 3 సంవత్సరాలు, విభిన్న సామర్థ్యం గల వ్యక్తులు: 10 సంవత్సరాలు, అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు ఉంటుంది. 

జీతం: రూ.18500.

దరఖాస్తు ఫీజు: ఓసీ, ఓసీ-ఈడబ్ల్యూఎస్ &బీసీ అభ్యర్థులకు రూ.500.; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.300. అభ్యర్థులు 'District Medical & Health Officer, Prakasam District, Ongole' పేరిట డిడి తీయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అకడమిక్ అర్హత- 65 మార్కులు, కంప్యూటర్ నైపుణ్య పరీక్ష 1:5 (కేటగిరీ వారీగా)- 15 మార్కులు, ఇంటర్వ్యూ1:2(సబ్జెక్ట్)- 20 మార్కులకు

చిరునామా:  
The District Coordinator, Dr.YSR AHCT, 
Opposite Prakasam Bhavan, Old RIMS
campus, Ongole, Prakasam District.

దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..

➥ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదితరగతి లేదా తత్సమాన సర్టిఫికేట్ కాపీ.

➥ పోస్టుకి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్ కాపీలు సమర్పించాలి.

➥ క్వాలిఫైయింగ్ లేదా తత్సమాన ఎగ్జామినేషన్‌కు సంబంధించిన అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు. మార్కుల మెమోలు లేనట్లయితే, అమలులో ఉన్న నిబంధనల ప్రకారం మార్కులు లెక్కించబడతాయి. 

➥ ఏపీ పారా మెడికల్ బోర్డ్/అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్/ఏదైనా ఇతర కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.

➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు/ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాపీ.

➥ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ సమర్పించాలి. లేని సమక్షంలో అభ్యర్థి ఓసీగా పరిగణించబడతారు.

➥ లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్(2023-24 సంవత్సరానికి సంబంధించిన) సర్టిఫికేట్.

➥ దివ్యాంగ సర్టిఫికేట్(SADAREM జారీ చేసిన).

➥ సంబంధిత మరియు వర్తించే ఏవైనా ఇతర సర్టిఫికేట్ కాపీలు. 

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 06.01.2024.

Notification

Application

Website 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola