హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వైద్యవిద్యా సంచాలకుల కార్యాలయం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు/ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రులలో ఏడాది కాలానికి తాత్కాలిక ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబరు 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 184
1) ప్రొఫెసర్: 81 పోస్టులు
2) అసోసియేట్ ప్రొఫెసర్: 103 పోస్టులు
అర్హతలు:
➥ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్‌గా కనీసం మూడేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. కనీసం నాలుగు రిసెర్చ్ పబ్లికేషన్స్ ఉండాలి. నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో బేసిక్ కోర్సు చేసి ఉండాలి. అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి బయోమెడికల్ రిసెర్చ్‌లో బేసిక్ కోర్సు చేసి ఉండాలి.
➥ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కనీసం నాలుగేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. కనీసం రెండు9రిసెర్చ్ పబ్లికేషన్స్ ఉండాలి. నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో బేసిక్ కోర్సు చేసి ఉండాలి. అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి బయోమెడికల్ రిసెర్చ్‌లో బేసిక్ కోర్సు చేసి ఉండాలి.
విభాగాలవారీగా ఖాళీలు..
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.
జీతం: ప్రొఫెసర్ ఉద్యోగాలకు నెలకు రూ.1,90,000; అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు నెలకు రూ.1,50,000.
వాక్ఇన్‌కు హాజరయ్యేవారు వెంట తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు ఇవే..
➥ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని, నింపిన అప్లికేషన్ ఫామ్
➥ ఆధార్ కార్డు, పాన్ కార్డు
➥ పుట్టినతేది ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా ఇంటర్ సర్టిఫికేట్
➥ 1-7వ తరగతులకు సంబంధించిన స్టడీ/బోనఫైడ్ సర్టిఫికేట్స్
➥ ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్‌డీ డిగ్రీ సర్టిఫికేట్లు
➥ ఎంబీబీఎస్ రిజిస్ట్రేషన్ (తెలంగాణ/ఏపీ మెడికల్ కౌన్సిల్), పీజీ క్వాలిఫికేషన్ రిజిస్ట్రేషన్ (తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి మాత్రమే). ఇతర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు తమ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫకేట్‌ను సమర్పించి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన వారంలోపు సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. లేకపోతే ఎంపికను పరిగణనలోకి తీసుకోరు.
➥ టీచింగ్ అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్
➥ పబ్లికేషన్ వివరాలకు సంబంధించిన కాపీలు
➥ ఒక జత సెల్ఫ్ అటెస్టెట్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు.
➥ విద్యార్హతలకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను తీసుకెళ్లాలి.
వాక్ఇన్ తేది: డిసెంబరు 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు.
వాక్ఇన్ వేదిక: OFFICE OF THE DIRECTOR OF MEDICAL EDUCATION, SULTAN BAZAR, KOTI, HYDERABAD.
Notification & Application:
Also Read:
ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీ విధానంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెడికల్ పీజీ (ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డీఎం, ఎండీ, ఎంఎస్సీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, మెరిట్ & రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
స్టాఫ్ నర్సు పోస్టులు 957కి పెరిగాయి, రివైజ్డ్ నోటిఫికేషన్ విడుదల!