Central Bank of India Recruitment: ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్- దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 484 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎస్‌ఎస్‌సీ/ పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 484


* సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్


జోన్లు, రాష్ట్రాల వారీగా ఖాళీలు..


➥ అహ్మదాబాద్ (గుజరాత్): 76


రీజియన్: అహ్మదాబాద్- 12, బరోడా- 17, గాంధీనగర్- 21, జామ్‌నగర్ - 11, సూరత్- 15.


➥ భోపాల్ (మధ్యప్రదేశ్- 24, ఛత్తీస్‌గఢ్- 14): 38 


రీజియన్: భోపాల్ - 14, ఇండోర్- 10, రాయ్‌పూర్- 14.


➥ ఢిల్లీ (ఢిల్లీ- 21, రాజస్థాన్- 55): 76 


రీజియన్: ఢిల్లీ ఎ(సౌత్)- 13, ఢిల్లీ బి(నార్త్)- 8, జైపూర్- 15, కోట- 20, జోధ్‌పూర్- 20.


➥ కోల్‌కతా (ఒడిషా): 02 


రీజియన్: భువనేశ్వర్- 2.


➥ లక్నో(ఉత్తర ప్రదేశ్) : 78


రీజియన్: బరేలీ- 3, ఇటావా- 9, డియోరియా- 10, గోరఖ్‌పూర్-18, ఝాన్సీ- 7, కాన్పూర్- 7, లక్నో- 12, వారణాసి - 12. 


➥ ఎంఎంజెడ్‌వో & పుణె- 118 (మహారాష్ట్ర)


రీజియన్: ముంబయి- 12, అమరావతి - 27, నాగ్‌పూర్ - 18, అహ్మద్‌నగర్- 18, ఔరంగాబాద్ - 13, నాసిక్ - 16, పూణే - 15. 


➥ పాట్నా- 96 (బిహార్- 76, ఝార్ఖండ్- 20) 


రీజియన్: దర్భంగా- 7, మోతీహరి- 11, ముజఫర్‌పూర్- 11, సివాన్- 13, పాట్నా- 14, గయ - 10, పూర్ణ - 10, ధన్‌బాద్- 10, రాంచీ- 10. 


అర్హత: ఎస్‌ఎస్‌సీ/ పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 31.03.2023 నాటికి 18 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఉంటుంది. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. 


దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.175.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష-70 మార్కులకు గాను ఇంగ్లిష్ లాంగ్వేజ్‌ నాలెడ్జ్‌- 10 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌- 20 మార్కులు, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్‌- 20 మార్కులు, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్)- 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు; పరీక్ష సమయం: 90 నిమిషాలు. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్- 30 మార్కులు కేటాయించారు; పరీక్ష సమయం: 30 నిమిషాలు.


పే స్కేల్: నెలకు రూ.14,500- రూ.28145.


ముఖ్యమైన తేదీలు..


➤ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 20.12.2023.


➤ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 09.01.2024.


➤ ప్రీ ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ ఎగ్జామ్‌ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: జనవరి 2024.


➤ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్: జనవరి 2024.


➤ ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్‌ డౌన్‌లోడ్: జనవరి/ ఫిబ్రవరి 2024.


➤ ఆన్‌లైన్ పరీక్ష: ఫిబ్రవరి 2024.


➤ పరీక్ష ఫలితాల వెల్లడి:  ఫిబ్రవరి 2024.


➤ లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ కాల్ లెటర్‌ డౌన్‌లోడ్‌: మార్చి 2024.


➤ లోకల్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ (జోన్ల వారీగా): మార్చి 2024.


➤ ప్రొవిజనల్‌ సెలెక్షన్‌: ఏప్రిల్ 2024.


Notification


Online Application 


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...