ASRB: ఐసీఏఆర్‌ పరిశోధన సంస్థల్లో 349 మేనేజ్‌మెంట్ పోస్టులు, అర్హతలివే!

దేశంలోని ఐసీఏఆర్ పరిశోధన సంస్థల్లో ఖాళీల భర్తీకి అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐదేళ్ల కాలపరిమితితో నాన్- రిసెర్చ్ మేనేజ్ మెంట్ పోస్టులను భర్తీ చేస్తారు.

Continues below advertisement

దేశంలోని ఐసీఏఆర్ పరిశోధన సంస్థల్లో వివిధ ఖాళీల భర్తీకి అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ASRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐదేళ్ల కాలపరిమితితో నాన్- రిసెర్చ్ మేనేజ్ మెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

Continues below advertisement


వివరాలు..

మొత్తం ఖాళీల సంఖ్య: 349

1) ప్రాజెక్ట్ కోఆర్డినేటర్

2) డివిజన్ హెడ్, రీజినల్ స్టేషన్/సెంటర్ హెడ్

3) సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్, (కృషి విజ్ఞాన కేంద్రం)

అర్హత: సంబంధిత విభాగంలో డాక్టరల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిన్సిపల్ సైంటిస్ట్/ ప్రొఫెసర్ లేదా తత్సమాన హోదాలో పని అనుభవం లేదా పరిశోధన/ బోధన అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు 60 సంవత్సరాలు, సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ పోస్టులకు 47 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

జీతభత్యాలు: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు రూ.1,44,200-రూ.2,18,200, సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ పోస్టులకు రూ.1,31,400-రూ.2,17,100 ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు: 


* ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, హెడ్ ఆఫ్ డివిజన్స్ పోస్టులకు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20.10.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.10.2022.

* సీనియర్ సైంటిస్ట్-కమ్-హెడ్ పోస్టులకు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.11.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.

Notification

Website


:: Read Also ::


IRCTC: ఐఆర్‌సీటీసీలో అప్రెంటిస్ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలుండాలి!

ఇండియన్ రైల్వే కేటరింగ్ & టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతిలో 50 శాతం మార్కులతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. 01.04.2022 నాటికి 15-25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

Railway Jobs: సదరన్‌ రైల్వేలో 3154 అప్రెంటిస్‌ ఖాళీలు, ఐటీఐ అర్హత!
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ ‌రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పదోతరగతి అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. షార్ట్‌లిస్టింగ్‌, అకడమిక్‌ మెరిట్‌, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల  కోసం క్లిక్ చేయండి..


Railway Jobs: ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!

కోల్‌కతాలోని తూర్పు రైల్వే , రైల్వే రిక్రూట్‌మెంట్‌సెల్ (ఆర్ఆర్‌సీ) తూర్సు రైల్వే పరిధిలోని వర్క్ షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి  అర్హులు. సెప్టెంబరు 30న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ ఫిట్‌నెస్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీ  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అక్టోబరు17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

Continues below advertisement
Sponsored Links by Taboola