ABP  WhatsApp

Watch Video: కళ్ల ముందే ప్రమాదం జరిగినా కన్నెత్తి చూడని కలెక్టర్- వైరల్ వీడియో!

ABP Desam Updated at: 11 Oct 2022 05:14 PM (IST)
Edited By: Murali Krishna

Watch Video: కలెక్టర్ కాన్వాయ్‌కు దారివ్వబోయి ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదాన్ని చూసి కలెక్టర్ కనీసం కారు ఆపకుండా వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(Image Source: Twitter)

NEXT PREV

Watch Video: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహ‌నాల రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంది. అయితే రోడ్డుపై ఓ గుంత వల్ల ఓ ఆటో బోల్తా పడింది. అయితే ఆ ఆటో ముందు నుంచే కలెక్టర్ కాన్వాయ్ వెళ్లింది. కానీ కనీసం కలెక్టర్ తన కాన్వాయ్ ఆపలేదు.


ఇదీ జరిగింది.


సీతాపుర్‌లో ఈ ఘటన జరిగింది. గుంతలమయం, వర్షపు నీటితో కూడిన రోడ్డుపై జిల్లా మెజిస్ట్రేట్‌ కాన్వాయ్ వెళ్తుండగా.. దానికి ఓ ఆటో సైడ్ ఇవ్వబోయింది. అయితే అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. అందులోని ప్రయాణికులందరు బురద నీటిలో పడిపోయారు. ఇంత జరిగినా కాన్వాయ్‌లో వెళ్తున్న అధికారులు, సిబ్బంది మాత్రం కనీసం పట్టించుకోలేదు. కనీసం వాహనం దిగి ఎవరికైనా ఏమైందో కూడా చూడకుండా అలానే వెళ్లిపోయారు. 




స్థానికులు మాత్రం వెంటనే వచ్చి సహాయం చేశారు. ఈ మొత్తం ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో వీడియో వైరల్ అవుతోంది. కాన్వాయ్ ఆపకుండా వెళ్లిపోయిన కలెక్టర్‌పై విమర్శలు చేస్తున్నారు.





సామాన్యులను పట్టించుకోరా? సామాన్యులు నడిరోడ్డుపై కిందపడినా పట్టించుకోని అధికారులు, ఇక ప్రభుత్వ కార్యాలయాలకు పని కోసం వెళ్తే వాళ్లను అసలు పట్టించుకుంటారా?                                                  -  నెటిజన్లు


Also Read: Viral Video: చనువు ఇచ్చిందిగా అని పులితో సెల్ఫీ దిగాలని చూస్తే!


Also Read: Mulayam Singh Yadav Funeral: ముగిసిన ములాయం అంత్యక్రియలు- కడసారి చూసేందుకు తరలివచ్చిన జనం!

Published at: 11 Oct 2022 05:14 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.