Viral Video: అటవీ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు వన్య మృగాలు కనబడటం సహజమే. అయితే వాటి మానాన అవి వెళ్లేటప్పుడు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. వాటిని ఫొటోలు తీయడం లేదా వాహనాన్ని ఆపకుండా వాటిపైకి పోనివ్వడం లాంటివి చాలా ప్రమాదకరం. తాజాగా కొంతమంది యువకులు ఇదే పని చేశారు. ఓ పులితో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు.
ఇలా జరిగింది
మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన జరిగింది. కొంత మంది యువకులు తమ వాహనాన్ని రహదారిపై ఆపి.. అటుగా వెళ్తోన్న పులిని ఫొటోలు తీశారు. అంతటితో ఆగకుండా పులితో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఆ పులి మూడ్ బావుండి వాళ్లు బతికిపోయారు. ఆ పులి సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. లేకపోతే ఏం జరిగేదో!
ఇందుకు సంబంధించిన వీడియోని భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఇటీవల
ఇటీవల ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలో దట్టమైన అడవి మధ్యలో రోడ్డు మార్గం ఉంది. అక్కడ తరచుగా వన్యప్రాణులు రోడ్డు దాటుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడ ఓ పులి రోడ్డు క్రాస్ చేసేందుకు ప్రయత్నించింది. వాహనాలు అటు ఇటు వేగంగా తిరగటం చూసి ఆగిపోయింది. ఇది చూసిన ట్రాఫిక్ పోలీస్ వెంటనే వాహనదారుల్ని ఎక్కడికక్కడే ఆపేశాడు. ట్రాఫిక్ అంతా క్లియర్ చేశాడు. వెంటనే ఆ పులి రాజసంగా నడుచుకుంటూ రోడ్డు దాటి అడవిలోకి వెళ్లిపోయింది. ఓ బైక్‌పైన ఉన్న వ్యక్తి అత్యుత్సాహంతో కిందకు దిగి వీడియో తీయబోతుండగా, ట్రాఫిక్ పోలీస్ వారించాడు. నిశ్శబ్దంగా ఉండాలంటూ సూచించాడు. అందరూ సైలెంట్ అయిపోయాక ఆ పులి మెల్లగా అడవిలోకి వెళ్లింది. అది వెళ్లిపోయేంత వరకూ వాహనదారులంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు.
ఈ వీడియోను ఓ ఫారెస్ట్ అధికారి ట్విటర్‌లో షేర్ చేశారు. "పులి కోసం గ్రీన్ సిగ్నల్ వేశారు" అని ట్వీట్ చేశారు. అయితే ఇది ఎక్కడ జరిగింది అన్నది మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. కొందరు బ్రహ్మపురి, నగ్‌బిర్ మార్గ మధ్యలో జరిగి ఉంటుందని చెబుతున్నారు.
Also Read: Mulayam Singh Yadav Funeral: ముగిసిన ములాయం అంత్యక్రియలు- కడసారి చూసేందుకు తరలివచ్చిన జనం!
Also Read: India Vote Against Russia: రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు- పుతిన్‌కు షాక్ ఇచ్చిన మోదీ!