ఏపీలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 1,543 టీచింగ్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) జిల్లాలవారీగా అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను జూన్‌ 15న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జాబితాలను పొందుపరిచారు. ఒక్క నెల్లూరు జిల్లా మినహాయించి, మిగతా అన్ని జిల్లాలకు సంబంధించిన మెరిట్ జామితాలను ఏపీఎస్ఎస్‌ఏ వెల్లడించింది. మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది మెరిట్‌ జాబితా విడుదల చేయనున్నారు. తుది మెరిట్‌ జాబితా వెల్లడి తర్వాత అభ్యర్థుల ధ్రుపపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.

జిల్లాలవారీగా ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలు ఇలా..

శ్రీకాకుళం జిల్లా మెరిట్ జాబితా  Click Here
విజయనగరం జిల్లా మెరిట్ జాబితా  Click Here
విశాఖపట్నం జిల్లా మెరిట్ జాబితా  Click Here
తూర్పుగోదావరి జిల్లా మెరిట్ జాబితా  Click Here
పశ్చిమ గోదావరి జిల్లా మెరిట్ జాబితా  Click Here
కృష్ణా జిల్లా మెరిట్ జాబితా  Click Here
గుంటూరు జిల్లా మెరిట్ జాబితా  Click Here
ప్రకాశం జిల్లా మెరిట్ జాబితా  Click Here
నెల్లూరు జిల్లా మెరిట్ జాబితా  త్వరలో వెల్లడిస్తారు
కడప జిల్లా మెరిట్ జాబితా  Click Here
కర్నూలు జిల్లా మెరిట్ జాబితా  Click Here
అనంతపురం జిల్లా మెరిట్ జాబితా  Click Here
చిత్తూరు జిల్లా మెరిట్ జాబితా  Click Here

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో పోస్టుల భర్తీకి తాత్కాలిక మెరిట్‌ జాబితాను విడుదల చేసినట్లు రాష్ట్ర పథక సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామని పేర్కొన్నారు. కేజీబీవీల్లో 1,358 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయగా.. ప్రభుత్వం మరో 197 పోస్టుల భర్తీకి అనుమతించింది. తాతాల్కిక జాబితాపై జూన్ 15, 16ల్లో ఉమ్మడి జిల్లా డీఈఓ కార్యాలయాల్లో అభ్యంతరాలు సమర్పించొచ్చని, అనంతరం జూన్ 19న తుది మెరిట్‌ జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. 20, 21 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, 22 నుంచి 24వరకు అభ్యర్థులకు జిల్లా కమిటీల ద్వారా నైపుణ్య పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 25న ఒప్పందం కుదుర్చుకొని, నియామక పత్రాలు జారీ చేస్తామని వెల్లడించారు.

నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

గురుకుల పోస్టుల దరఖాస్తుల సవరణ, ఈ తేదీల్లోనే అవ‌కాశం!
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో 9,231 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన సంగ‌తి తెలిసిందే. అర్హత గ‌ల అభ్యర్థుల నుంచి ఇప్పటికే ద‌ర‌ఖాస్తులు స్వీకరించారు. అయితే అభ్య‌ర్థుల‌కు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది గురుకుల నియామ‌క బోర్డు. అభ్య‌ర్థులు ఒకసారి మాత్రమే త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. ఎడిట్ చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ప్రింట్ తీసుకుని భ‌ద్ర‌ప‌రుచుకోవాని సూచించారు.
దరఖాస్తుల సవరణ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 782 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడును అనుసరించి పదోతరగతి, పన్నెండో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ  ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..