APPSC Recruitment: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసులో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 04 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొదటి లేదా ద్వితీయ శ్రేణిలో ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత. డిగ్రీ(బయాలజీ), కంప్యూటరైజ్డ్ డేటాబేస్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 27 నుంచి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 04


* లైబ్రేరియన్‌ పోస్టులు


అర్హత: ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్‌లో ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత. డిగ్రీ(బయాలజీ), కంప్యూటరైజ్డ్ డేటాబేస్‌ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.


వయోపరిమితి: 01.07.2024 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్, ఎన్‌సీసీ అభ్యర్థులకు, తాత్కాలిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు; ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


READ ALSO : ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 18 అనలిస్ట్ పోస్టులు, ఈ అర్హతలుండాలి


దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ 120 కలిపి మొత్తం రూ.370 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు, తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. వీరు కేవలం ప్రాసెసింగ్ ఫీజు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 


పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాలపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2(సంబంధిత సబ్జెక్టు): 150 ప్రశ్నలు-300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.


ప్రాక్టికల్ పరీక్షలు: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఫ్రొఫీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఆఫీస్ ఆటోమేషన్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో అర్హత మార్కులను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30గా, బీసీలకు 35గా, ఓసీలకుు 40 మార్కులుగా నిర్ణయించారు.


పే స్కేల్: నెలకు రూ.48,440-1,37,220.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.04.2024. 


Notification


Wensite


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.