ఆంధ్రప్రదేశ్‌లో 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష వాయిదాపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న గ్రూప్-1 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పాలనాపరమైన కారణాల చేత పరీక్షను వాయిదావేస్తున్న ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 8న గ్రూప్-1 నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 30న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 92 గ్రూప్-1 పోస్టులను భర్తీచేయనుంది. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 10 నుంచి నవంబరు 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది.
వాస్తవానికి నవంబరు 2తో ముగియాల్సిన దరఖాస్తు గడువును నవంబరు 5 వరకు పొడిగించింది. అయితే 'గ్రూప్-1' పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న 'గ్రూప్-1' స్క్రీనింగ్ పరీక్షను, వచ్చే ఏడాది మార్చి రెండో వారంలో 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. అయితే తాజాగా ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి 8న పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది.
పరీక్ష విధానం..
➥ ప్రిలిమినరీ పరీక్ష:
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయించారు.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.
➥ మెయిన్ పరీక్ష:
మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి.
* పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు
* పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు
* పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు
* తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే.
మెయిన్ పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
పోస్టులు, పరీక్ష సిలబస్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఏపీలో 3673 కోర్టు ఉద్యోగాలు - నోటిఫికేషన్లు, పోస్టుల పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.
నోటిఫికేషన్లు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..