ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఏపీ హైకోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అమరావతిలోని ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 19 రకాల నోటిఫికేషన్‌ల ద్వారా 3673 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటిల్లో హైకోర్టు పరిధిలో 241 పోస్టులు ఉండగా, రాష్ట్రంలోని అన్ని జిల్లా కోర్టుల్లో 3432 ఖాళీలు ఉన్నాయి.
హైకోర్టులో 241 పోస్టుల్లో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులే ఉన్నాయి. ఇక మిగతా పోస్టుల్లో 36-టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు; 27-అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టులు ఉండగా.. మిగతావి ఓవర్ సీర్, అసిస్టెంట్ ఓవర్ సీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్ పోస్టలు ఉన్నాయి.
ఇక జిల్లా కోర్టుల ఖాళీలను పరిశీలిస్తే.. ప్రకటించిన 3432 పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్-1520, జూనియర్ అసిస్టెంట్-681, ప్రాసెస్ సర్వర్-439, కాపీయిస్ట్-209, టైపిస్ట్-170, ఫీల్డ్ అసిస్టెంట్-158, ఎగ్జామినర్-112, స్టెనోగ్రాఫర్-114 పోస్టులు ఉండగా.. మిగతావి రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకీ అక్టోబరు 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 11 వరకు గడువు ఉంది. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.800 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇక హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి అక్టోబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. నవంబరు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీల సంఖ్య: 3,673
హైకోర్టు ఖాళీల వివరాలు: 241
1) ఆఫీస్ సబార్డినేట్: 135 పోస్టులు
2) టైపిస్ట్, కాపీయిస్ట్: 36 పోస్టులు
3) అసిస్టెంట్, ఎగ్జామినర్: 27 పోస్టులు
4) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13 పోస్టులు
5) కంప్యూటర్ ఆపరేటర్: 11 పోస్టులు
6) సెక్షన్ ఆఫీసర్/ కోర్టు ఆఫీసర్/స్క్రూటినీ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: 09 పోస్టులు
9) అసిస్టెంట్ ఓవర్‌సీర్: 01 పోస్టు
జిల్లా కోర్టు ఖాళీలు: 3432
10) ఆఫీస్ సబార్డినేట్: 1520 పోస్టులు
11) జూనియర్ అసిస్టెంట్: 681 పోస్టులు
12) ప్రాసెస్ సర్వర్: 439 పోస్టులు
15) ఫీల్డ్ అసిస్టెంట్: 158 పోస్టులు
16) స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 114 పోస్టులు
18) డ్రైవర్(లైట్ వెహికిల్): 20 పోస్టులు
19) రికార్డ్ అసిస్టెంట్: 09 పోస్టులు
ముఖ్యమైన తేదీలు..
* హైకోర్టు ఉద్యోగాల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 29.10.2022.
* హైకోర్టు ఉద్యోగాల ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.11.2012.
* జిల్లా కోర్టు ఉద్యోగాల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.10.2022.
* జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 11.11.2022.
:: ALSO READ ::
నిజామాబాద్ ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులో వివిధ ఉద్యోగాలు, అర్హతలివే!
నిజామాబాద్‌లోని ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు(పోక్సో)లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి విద్యర్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు నిజామాబాద్ జిల్లాకు చెందినవారై ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో 632 ఖాళీలు
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగంలో లైబ్రేరియన్, టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు అక్టోబరు 19 నుంచి నవంబరు 18 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..