ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. ఇటీవలే వివిధ శాఖల్లో 269 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్ తాజాగా 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. అక్టోబరు 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 1లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
వివరాలు..
* గ్రూప్-1 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 92 (క్యారీడ్ ఫార్వర్డ్-02, కొత్తవి-90).
విభాగాలవారీగా ఖాళీలు:
1) డిప్యూటీ కలెక్టర్:10 పోస్టులు
విభాగం: ఏపీ సివిల్ సర్వీస్(ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్).
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-రూ.1,51,370.
2) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్: 12 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ టాక్స్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-రూ.1,51,370.
3) డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసు (సివిల్) క్యాట్-2: 13 పోస్టులు
విభాగం: ఏపీ పోలీస్ సర్వీ్స్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.61,960-రూ.1,51,370.
4) డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్ (మెన్): 02 పోస్టులు
విభాగం: ఏపీ జైల్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
5) డివిజనల్/డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్: 02 పోస్టులు
విభాగం: స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్&ఫైర్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంజినీరింగ్-ఫైర్)/బీఈ(ఫైర్)
వయోపరిమితి: 01.07.2022 నాటికి 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
6) అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: 08 పోస్టులు
విభాగం: ఏపీ ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
7) రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్స్: 02 పోస్టులు
విభాగం: ఏపీ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
8) మండల్ పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 07 పోస్టులు
విభాగం: ఏపీ పంచాయత్ & రూరల్ డెవలప్‌మెంట్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
9) డిస్ట్రిక్ట్ రిజిస్టార్స్: 03 పోస్టులు
విభాగం: ఏపీ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
10) డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫిసర్: 01పోస్టు
విభాగం: ఏపీ ట్రైబల్ వెల్ఫే్ర్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
11) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 02 పోస్టులు
విభాగం: ఏపీ బీసీ వెల్ఫే్ర్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
12) మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-II: 06 పోస్టులు
విభాగం: ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
13) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్/ లే సెక్రటరీ & ట్రెజరర్ గ్రేడ్-II: 18 పోస్టులు.
విభాగం: ఏపీ మెడికల్ అండ్ హెల్త్ (అడ్మినిస్ట్రేషన్) సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
14) డిప్యూటీ రిజిస్ట్రార్: 01 పోస్టు
విభాగం: ఏపీ కోఆపరేటివ్ సర్వీసెస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.57,100-రూ.1,47,760.
15) అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్: 04 పోస్టులు
విభాగం: ఏపీ స్టేట్ ఆడిట్ సర్వీస్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.
వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం: రూ.54,060 - రూ.1,40,540.
వయోసడలింపు: నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎస్సీ/ఎస్టీ(CF), దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, NCC (ఇన్‌స్ట్రక్టర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామ్ (డిస్క్రిప్టివ్), పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా.
* ప్రిలిమినరీ పరీక్ష:
మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది స్క్రీనింగ్ టెస్ట్. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. 120 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 30 మార్కులు కేటాయించారు. అదేవిధంగా 120 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రెండు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 60 మార్కులు కేటాయించారు.
* మెయిన్ పరీక్ష:
మొత్తం 825 మార్కులకు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 75 మార్కులు పర్సనాలిటీ టెస్టుకు కేటాయించారు. మిగతా మార్కులు 5 పేపర్లకు ఉంటాయి.
* పేపర్-1 (జనరల్ ఎస్సే): 150 మార్కులు
* పేపర్-2 (హిస్టరీ & కల్చర్ & జియోగ్రఫీ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-3 (పాలిటీ, కాన్‌స్టిట్యూషన్, గవర్నెన్స్, లా & ఎథిక్స్): 150 మార్కులు
* పేపర్-4 (ఎకానమీ & డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా/ఏపీ): 150 మార్కులు
* పేపర్-5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్): 150 మార్కులు
* తెలుగు, ఇంగ్లిష్ పరీక్షలు కూడా ఉంటాయి కాని, ఇవి క్వాలిఫైయింగ్ పేపర్లు మాత్రమే
పరీక్ష స్వరూపం, సిలబస్ వివరాలు...
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ.250 దరఖాస్తు ఫీజుగా, రూ.120 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, తెల్లరేషన్ కార్డు దారులకు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: ఏపీలోని అన్ని జిల్లాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.
మెయిన్ పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.10.2022.
ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.11.2022.
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 18.12.2022.
మెయిన్ పరీక్ష తేది: 2023 మార్చి రెండోవారంలో.
Also Read:
APPSC: 'గ్రూపు-1' ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూలు
ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గత జూన్‌లో ఇంటర్వ్యూలను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే మళ్లీ పాత విధానంలోనే గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని సభ్యులు తెచ్చిన ఒత్తిళ్ల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్-1 ఇంటర్వ్యూ పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..
APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో వివిధ గ్రూప్-4 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 29న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు అక్టోబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేద లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!
ఏపీలోని ఆయుష్ విభాగంలో మెడికల్ ఆఫీసర్ (యునాని/హోమియో/ఆయుర్వేద) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. యునానీ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 6 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ ఇన్స్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఏపీలో ఏఈఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హత, ఎంపిక వివరాలు ఇవే!
ఏపీలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రంలోని వివిధ జోన్ల పరిధిలో ఏఈఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..