కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్' (The Ghost). ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. విజయ దశమి కానుక (Dussehra 2022 Tollywood Special) గా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. అయితే... అక్టోబర్ 5న కాదు. రెండు రోజుల ఆలస్యంగా!
అక్టోబర్ 7న హిందీలో 'ది ఘోస్ట్' విడుదల!
Producer Sunil Narang On The Ghost Movie Hindi Release : నార్త్ ఇండియాలో 'ది ఘోస్ట్' హిందీ వెర్షన్ అక్టోబర్ 7న విడుదల కానుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన సునీల్ నారంగ్ వెల్లడించారు. సినిమా స్టార్ట్ చేసినప్పుడు హిందీ రిలీజ్ ఉందా? లేదా? అని ఆయన్ను ప్రశ్నించగా... ''మా ప్లాన్‌లో లేదు. సెప్టెంబర్ 5 లేదా 6 తేదీల్లో డిసైడ్ చేశాం. తర్వాత కొంత కన్‌ఫ్యూజన్ నెలకొంది. చేయాలా? వద్దా?' అని! ఆ తర్వాత మనీష్ ఫోన్ చేసి హిందీలో కూడా విడుదల చేద్దామని అడిగారు. మేం ఓకే అన్నాం. కొంచెం లేటుగా ప్లాన్ చేశారు. ముందు చేసి ఉంటే బావుండేది'' అని సమాధానం ఇచ్చారు. హిందీ నుంచి 'ఘోస్ట్' ట్రైలర్, సినిమాకు ఇటువంటి స్పందన వస్తుందని ముందుగా ఊహించలేదని ఆయన తెలిపారు.
సోమవారం 'ది ఘోస్ట్' సెన్సార్!
'ది ఘోస్ట్' సినిమా తెలుగు సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. హిందీ సెన్సార్ ఇంకా కాలేదు. ప్రజెంట్ డబ్బింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. సోమవారం హిందీ వెర్షన్ సెన్సార్ కంప్లీట్ చేయనున్నారు.
'ది ఘోస్ట్' సినిమాను స్టార్ట్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అయితే... ట్రైలర్ విడుదలైన తర్వాత ఇతర భాషల నుంచి మంచి స్పందన లభించింది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు స్టైలిష్ టేకింగ్, క్లాస్‌లో మాస్ చూపిస్తూ నాగార్జున చేసిన ఫైట్స్ ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 'ది ఘోస్ట్' ట్రైలర్ విడుదలైన రెండు వారాలకు థియేటర్లలోకి 'బ్రహ్మాస్త్ర' సినిమా వచ్చింది. అందులో నంది అస్త్రంగా నాగార్జున పాత్ర వీరోచితంగా ఉంది. ఉత్తరాది ప్రేక్షకులు సైతం ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. దాంతో సినిమాను హిందీలో విడుదల చేయాలని నిర్ణయించారు.
Also Read : 'గాడ్ ఫాదర్' వర్సెస్ 'ఘోస్ట్' - ఒకటి టమోటా, ఇంకొకటి ఉల్లిపాయ్
'ది ఘోస్ట్' సినిమాలో నాగార్జునకు జంటగా ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) నటించారు. వాళ్ళిద్దరి మీద తెరకెక్కించిన రొమాంటిక్ సాంగ్ 'వేగం...'ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. భరత్, సౌరబ్ ద్వయం ఆ పాటకు సంగీతం అందించగా... కపిల్ కపిలన్, రమ్య బెహరా ఆలపించారు.
సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో అక్టోబర్ 5న విడుదల చేస్తారా? లేదంటే... కొంచెం ఆగుతారా? అనేది చూడాలి. మ్యాగ్జిమమ్ ఒకే రోజు దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : నుదుట గాయం, రక్తంతో సుధీర్ బాబు - రిలీజ్‌కు 'హంట్' టీజర్ రెడీ