DCHS Kadapa Recruitment Notification: కడపలోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీస్‌- ఒప్పంద ప్రాతిపదికన వైఎస్ఆర్ జిల్లా వైద్య సంస్థల్లో వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. దీనిద్వారా గవర్నమెంట్ మెడికల్‌ కాలేజీ (కడప), ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ (కడప), క్యాన్సర్ కేర్ సెంటర్ (కడప), డా.వైఎస్‌ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (పులివెందుల), గవర్నమెంట్ మెడికల్‌ కాలేజీ-పులివెందులలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 21లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 


వివరాలు..


* పారామెడికల్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 208.


➥ క్లినికల్ సైకాలజిస్ట్‌: 02 పోస్టులు


➥ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్: 01 పోస్టు


➥ ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 01 పోస్టు


➥ సైకియాట్రీ సోషల్ వర్కర్: 08 పోస్టులు


➥ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు


➥ యోగా ఇన్‌స్ట్రక్టర్: 01 పోస్టు


➥ ఎలక్ట్రీషియన్స్: 06 పోస్టులు


➥ ల్యాబ్ టెక్నీషియన్ (గ్రేడ్-2): 03 పోస్టులు


➥ అనస్తీషియా టెక్నీషియన్: 02 పోస్టులు


➥ ఈసీజీ టెక్నీషియన్: 02 పోస్టులు


➥ ఈఈజీ టెక్నీషియన్: 05 పోస్టులు


➥ జూనియర్ అసిస్టెంట్: 02 పోస్టులు


➥ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 03 పోస్టులు


➥ ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 03 పోస్టులు


➥ రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్/ మెడికల్ ఫిజిస్ట్: 02 పోస్టులు


➥ రేడియోథెరపీ టెక్నీషియన్: 06 పోస్టులు


➥ మౌల్డ్ రూమ్ టెక్నీషియన్: 02 పోస్టులు


➥ సీటీ టెక్నీషియన్: 02 పోస్టులు


➥ ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 10 పోస్టులు


➥ అనస్తీషియా టెక్నీషియన్: 10 పోస్టులు


➥ ఏవీ టెక్నీషియన్: 01 పోస్టు


➥ బయోమెడికల్ టెక్నీషియన్: 03 పోస్టులు


➥ కార్డియాలజీ టెక్నీషియన్: 03 పోస్టులు


➥ చైల్డ్ సైకాలజిస్ట్: 01 పోస్టు


➥ క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టు


➥ కంప్యూటర్ ప్రోగ్రామర్: 02 పోస్టులు


➥ డెంటల్ టెక్నీషియన్: 01 పోస్టు


➥ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్: 32 పోస్టులు


➥ ల్యాబ్ టెక్నీషియన్: 22 పోస్టులు


➥ లైబ్రేరియన్ అసిస్టెంట్: 04 పోస్టులు


➥ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టులు


➥ ఓటీ టెక్నీషియన్: 05 పోస్టులు


➥ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్: 01 పోస్టు


➥ ఫిజియోథెరపిస్ట్: 01 పోస్టు


➥ రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్: 03 పోస్టులు


➥ రిఫ్రాక్షనిస్ట్: 01 పోస్టు


➥ స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు


➥ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు 


అర్హతలు: పోస్టులవారీగా పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.250. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు అకౌంట్: 10844897630; IFSC Code : SBIN0010107, Govt. Medical College, Kadapa పేరిట ఫీజు చెల్లించాలి.


ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Office of Principal,
Govt. Medical College, Putlampalli, 
Kadapa, YSR District.


ముఖ్యమైన తేదీలు..


* దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 21.12.2023.


* దరఖాస్తుల పరిశీలన:  22.12.2023 - 29.12.2023.


* ప్రొవిజినల్ మెరిట్ జాబితా వెల్లడి: 30.12.2023.


* జాబితాపై అభ్యంతరాల స్వీకరణ: 01.01.2024 - 02.01.2024.


* తుది మెరిట్ జాబితా వెల్లడి: 06.01.2024.


* ధ్రువపత్రాల పరిశీలన, నియామక పత్రాల పంపిణీ: 08.01.2024. 


Notification


Application


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...