NIA Raids Four States : జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఈ వ్యవహారంలో ఇస్లామిక్‌ స్టేట్‌ (ISIS)తో సంబంధం ఉన్న మొత్తం ఎనిమిది మంది ఏజెంట్ల ( Agents )ను అరెస్టు చేసింది. గత వారం ఎన్‌ఐఏ మహారాష్ట్రలోని 40 చోట్ల దాడులు చేసి, 15 మంది అనుమానితులను అరెస్టు చేసింది. ఎన్‌ఐఏ అధికారులు మహారాష్ట్ర, ఢిల్లీ, ఝార్ఖండ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని 19 ప్రదేశాల్లో దాడులు చేపట్టారు.  వీరంతా ఐసిస్‌ బళ్లారి మాడ్యుల్‌ (Bellary Module )కు చెందినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాల నిల్వలు, మారణాయుధాలు, నగదు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. పట్టుబడిన వారంతా పేలుళ్లకు కుట్ర పన్నినట్లు, దాడుల ప్రణాళికతో కూడిన పత్రాలూ లభ్యమైనట్లు తెలిపింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఢిల్లీ పోలీసుల సహకారంతో NIA ఈ సోదాలు జరిపింది. ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థకు చెందిన 8 మంది ఏజెంట్లను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్ర కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు.


బళ్లారి మాడ్యూల్‌ లీడర్‌ మినాజ్‌ అరెస్ట్


బళ్లారి మాడ్యూల్‌పై కొన్ని రోజుల క్రితం జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు, ఇతర కేంద్ర సంస్థలతో కలిసి నిందితుల కోసం వేట కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. బళ్లారి మాడ్యూల్‌ లీడర్‌ మినాజ్‌ అలియాస్‌ మహ్మద్ సులేమాన్‌నూ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరపడానికి ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ యాప్‌లను ఉపయోగించారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. పేలుడు పదార్థాలను ఉపయోగించి ఐఈడీలు, ఇతర పేలుడు పరికరాలను రూపొందించడానికి ప్లాన్ చేశారు. కళాశాల విద్యార్థులను ఉగ్ర కార్యకలాపాల దిశగా ఆకర్షించేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు తేలింది. మినాజ్‌ నేతృత్వంలో వీరంతా పని చేస్తున్నారు.


నగదు, ఫోన్లు, డిజిటల్ పరికరాలు సీజ్
నిందితుల వద్ద నుంచి ఎన్ఐఏ అధికారులు పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలకు ఉపయోగించే ముడి సరకులైన సల్ఫర్‌, పొటాషియం నైట్రేట్, బొగ్గు, గన్‌పౌడర్, చక్కెర, ఇథనాల్, పదునైన ఆయుధాలు ఉన్నాయి. నగదు, నేరారోపణ పత్రాలు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు ఐఈడీల తయారీకి ఈ సామగ్రిని ఉగ్ర ముఠా సభ్యులు ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌ల ద్వారా వీరంతా ఉగ్ర సంస్థలతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తుల తేలింది.


నియామకాలపై ఫోకస్
ఉగ్ర కార్యకలాపాల కోసం కళాశాల విద్యార్థులను నియమించుకోవడంపై వీరు దృష్టి పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ముజాహిదీన్​కు చెందిన పత్రాలను పంపిణీ చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ పోలీసుల సహకారంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 14న ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు వివరించారు. అప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు, కేంద్ర ఏజెన్సీలతో సమన్యయం చేసుకుంటున్నా. తాజా దాడులతో 8 మందిని అరెస్ట్ చేసి..ఉగ్రకుట్రను భగ్నం చేసింది ఎన్ఐఏ