ఆంధ్రప్రదేశ్‌లోని ఆదర్శ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(పీజీటీ) పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 71 టీజీటీ పోస్టులు, 211 పీజీటీ పో

పోస్టుల వివరాలు...

ఖాళీల సంఖ్య: 282


1)  ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ): 71 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ.

2) పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీ): 211 పోస్టులు

సబ్జెక్టులు: తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్.


జోన్ల వారీగా ఖాళీలు:
టీజీటీ: జోన్-1 పరిధిలో 17 పోస్టులు, జోన్-3 పరిధిలో 23 పోస్టులు, జోన్-4 పరిధిలో 31 పోస్టులు ఉన్నాయి.
పీజీటీ: జోన్-1 పరిధిలో 33 పోస్టులు, జోన్-2 పరిధిలో 4 పోస్టులు, జోన్-3 పరిధిలో 50 పోస్టులు, జోన్-4 పరిధిలో 124 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా రెండు పోస్టులు కలిపి జోన్-1 పరిధిలో 50 పోస్టులు, జోన్-2 పరిధిలో 4 పోస్టులు, జోన్-3 పరిధిలో 73 పోస్టులు, జోన్-4 పరిధిలో 155 పోస్టులు ఉన్నాయి. 

అర్హతలు: పీజీటీ ఖాళీలకు రెండేళ్ల మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. సంబంధిత సబ్జెక్టు మెథడాలజీలో బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎంకాం అప్లైడ్, బిజినెస్ ఎకనామిక్స్ సబ్జెక్టు అర్హత కలిగిన అభ్యర్థులు పీజీటీకి అనర్హులు. టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టు్లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో బీఈడీ, తదితర ప్రొఫెషనల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితిని జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా నిర్ణయించారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: జోన్, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన ఉండే కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. వీటిలో డిగ్రీ, పీజీకి 60 శాతం, బీఈడీకి 10 శాతం, గతంలో అతిథి అధ్యాపకులుగా చేసినవారికి 20శాతం, టీచింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, టీచింగ్ డెమోకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది.

జీతం: టీజీటీ పోస్టులకు రూ.32,000, పీజీటీ పోస్టులకు రూ.35,000 ఇస్తారు. ఇతర భత్యాలు కూడా అందుతాయి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2022.

ఆన్‌లైన్  దరఖాస్తులకు చివరి తేది: 17.08.2022

ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రకటన: 23.08.2022.

అభ్యంతరాల స్వీకరణ తేదీలు: 24 – 25.08.2022.

ఇంటర్వ్యూ జాబితా విడుదల:  29.08.2022.

వెబ్ కౌన్సెలింగ్  నిర్వహణ: 08.11.2022

ఎంపికైన అభ్యర్థుల జాయినింగ్  తేది:  09.11.2022.


Notification

Online Application

Website


 


Also Read: టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇవే!

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో 319 ఉద్యోగాలు, వివరాలు ఇలా!


 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...