విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య, కుటుంబ సంక్షే డైరెక్టర్ కార్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆసుపత్రులు, డీఎంఈ విభాగాల్లో పని చేయడానికి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 823
1) సివిల్ అసిస్టెంట్ సర్జన్: 635 పోస్టులు
విభాగం: ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టరేట్.
2) సివిల్ అసిస్టెంట్ సర్జన్: 188 పోస్టులు
విభాగం: ఏపీ వైద్య విధాన పరిషత్.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత,
వయోపరిమితి: 01.07.2022 నాటికి 42 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో అర్హత పరీక్ష(ఎంబీబీఎస్)లో మెరిట్‌కు 75 మార్కులు, 15 మార్కులు పని అనుభవానికి, మిగతా 10 మార్కులు ఇంటర్న్‌షిప్‌కు కేటాయిస్తారు. వెయిటేజీ కూడా వర్తిస్తుంది. రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు.
దరఖాస్తు ఫీజు: “Axis Bank, Bhavanipuram Account holder : Director of Public Health and Family Welfare Account No. 913020053261532. IFSC Code: UTIB0001900” పేరిట రూ.500 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 969 పోస్టులు.. అర్హతలివే
జీతభత్యాలు: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.61,960 చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-07-2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.08.2022.