తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యారోగ్యశాఖలో వివిధ ఉద్యోగాల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


వివరాలు..


పోస్టుల సంఖ్య: 969


1)  సివిల్ అసిస్టెంట్ సర్జన్: 751 పోస్టులు


విభాగం: పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్.


2) సివిల్ అసిస్టెంట్ సర్జన్: 211 పోస్టులు


విభాగం: వైద్య విధాన పరిషత్.


3) సివిల్ అసిస్టెంట్ సర్జన్: 07 పోస్టులు


విభాగం: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్.


అర్హత: ఎంబీబీఎస్/ తత్సమాన విద్యార్హత ఉండాలి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.


తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత,


వయోపరిమితి: 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎన్‌సీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగులకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.


జీతం: రూ.58,850-రూ.1,37,050 వరకు చెల్లిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: మొత్తం 100 పాయింట్లకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో విద్యార్హతకు 80 పాయింట్లు, పని అనుభవానికి 20 పాయింట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద లేదా ఔట్‌సోర్సింగ్ పద్దతిలో పనిని పరిగణనలోకి తీసుకుంటారు.


దరఖాస్తు, పరీక్ష ఫీజు: రూ.320. ఇందులో దరఖాస్తు ఫీజు రూ.200, పరీక్ష ఫీజు రూ.120 కాగా.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్యూఎస్ అభ్యర్థులకు; ఎక్స్-సర్వీస్‌మెన్ ఉద్యోగులకు; దివ్యాంగులకు  నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.


తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులు.. అర్హతలు, దరఖాస్తు వివరాలు ఇలా!


 ముఖ్యమైన తేదీలు...


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.07.2022.


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 14.08.2022.


Notification


Online Application


Website


 


Note: CORRIGENDUM -2
Candidates applying for the posts notified vide Notification No.1/2022 are informed
that government in Memo No.6509/A/2022-1 HM&FW(A) Department Dated
15.7.2022 has requested MHSRB to withdraw 357 posts of Tutors notified.
Government has further informed that recruitment for these posts of Tutors shall be
taken up separately as per latest NMC regulations.