అమరావతిలోని ఏపీ హైకోర్టులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా 241 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు నవంబరు 4న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 21తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 21న రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంది. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.800 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.400 చెల్లిస్తే సరిపోతుంది.
హైకోర్టులో 241 పోస్టుల్లో 135 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులే ఉన్నాయి. ఇక మిగతా పోస్టుల్లో 36-టైపిస్ట్, కాపీయిస్ట్ పోస్టులు; 27-అసిస్టెంట్, ఎగ్జామినర్ పోస్టులు ఉండగా.. మిగతావి ఓవర్ సీర్, అసిస్టెంట్ ఓవర్ సీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
హైకోర్టు ఖాళీల వివరాలు: 241 పోస్టులు
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
➥ ఆఫీస్ సబార్డినేట్: 135 పోస్టులు
➥ టైపిస్ట్, కాపీయిస్ట్: 36 పోస్టులు
➥ అసిస్టెంట్, ఎగ్జామినర్: 27 పోస్టులు
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 13 పోస్టులు
➥ కంప్యూటర్ ఆపరేటర్: 11 పోస్టులు
➥ సెక్షన్ ఆఫీసర్/ కోర్టు ఆఫీసర్/స్క్రూటినీ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్: 09 పోస్టులు
➥ అసిస్టెంట్ ఓవర్‌సీర్: 01 పోస్టు
Also Read:
ఏపీలో సివిల్ జడ్జి పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 25 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, మిగతా 6 పోస్టులు ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. లా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నవంబరు 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. డిసెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ప్రకాశం జిల్లాలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
ప్రకాశం జిల్లాలోని వైఎస్సార్ అర్బన్ క్లినిక్/ యూపీహెచ్‌సీల్లో ఒప్పంద/ ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి పదోతరగతి, ఎంబీబీఎస్, డీఫార్మసీ/ బీఫార్మసీ, డిప్లొమా, బీఎస్సీ(ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నిర్ణిత దరఖాస్తులను నింపి సంబధిత ధృవ పత్రాలను జతపరిచి వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాలో అందచేయాలి.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి...