ఏపీలో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అక్టోబరు 14, 15 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో.. అక్టోబరు 13న ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత ఉన్నప్పటికీ అన్యాయంగా తమను అనర్హతకు గురిచేశారని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఎత్తు కొలిచే విషయంలో పరికరాల తప్పిదం వల్ల వేలాది మంది అభ్యర్థులు అర్హత కోల్పోవడంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది.


అనర్హత పొందిన అభ్యర్థులందరికీ మరోసారి దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించి, ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మాన్యువల్‌గా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థినీ అనుమతించాలని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి సమాచారం ఇచ్చి.. ఈ ప్రక్రియ మొత్తం 3 రోజులలోపు పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


తాజాగా ఎస్‌ఐ నియామక ప్రక్రియలో ఛాతీ, ఎత్తు డిజిటల్‌ మీటర్‌ ద్వారా లెక్కించడంతో అనర్హులయ్యామని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిజిటల్‌గా కాకుండా మాన్యువల్‌గానే ఫిజికల్ పరీక్షలు నిర్వహించేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత అక్టోబర్‌ 12న విచారణ జరిపారు. 


విచారణలో భాగంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల మంది ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరయ్యారని.. వారిలో సరిపడా ఎత్తు లేరనే కారణంగా 5 వేల మందిని తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌ కోర్టుకు తెలిపారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. 2019లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పుడెందుకు తిరస్కరణకు గురయ్యారని ధర్మాసనం ప్రశ్నించింది. 2019లో నిర్వహించిన పరీక్షల్లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన పిటిషనర్లు ప్రస్తుతం డిజిటల్‌ మీటర్‌ను వినియోగించడంతో అనర్హులయ్యారన్నారు.


ప్రతి అభ్యర్థి విషయంలో చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అక్టోబరు 14, 15 తేదీల్లో జరిగే మెయిన్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాల వల్ల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరారు. నిబంధనల మేరకే వ్యవహరించామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. తాజాగా తీర్పును వెలువరించింది.


ALSO READ:


ఆప్కాబ్‌‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


భారత నౌకాదళంలో 224 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ పోస్టులు, వివరాలు ఇలా
భారత నౌకాదళం షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ) జూన్ 2024లో ప్రారంభమయ్యే కోర్సులో ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖలు, కేడర్‌, స్పెషలైజేషన్లలో శిక్షణ పొందుతారు. డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా నౌకాదళంలో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులకు సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది. సరైన అర్హతలు గల అవివాహిత పురుషులు, మహిళా అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..