A.P.M.S Specialist Doctors Recruitment:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య సేవల నియామక మండలి, 'నేషనల్ హెల్త్ మిషన్‌'లో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో 'స్పెషలిస్ట్ డాక్టర్' పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌, డిస్ట్రిక్‌ ఎర్లీ ఇంటర్‌వెన్షన్‌ సెంటర్‌, తదితర ఆసుపత్రుల్లో 234 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 7న రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. అడకమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికచేస్తారు.


వివరాలు..


* స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 234.


విభాగాలవారీగా ఖాళీలు..


➥ జనరల్ మెడిసిన్: 38 పోస్టులు


➥ అబ్‌స్టేట్రిక్స్ & గైనకాలజీ: 38 పోస్టులు


➥ పీడియాట్రీషియన్ (NUHM): 38 పోస్టులు


➥ పీడియాట్రీషియన్ (DEIC): 06 పోస్టులు


➥ పీడియాట్రీషియన్ (SNCU): 70 పోస్టులు 


➥ కార్డియోలజిస్ట్/జనరల్ మెడిసిన్: 21 పోస్టులు 


అర్హతలు..


🔰 ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా అర్హత ఉండాలి. 


🔰 ఎపిడెమియోలజిస్ట్ పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు ఎండీ(ఎస్‌పీఎం) లేదా మాస్టర్ డిగ్రీ (పబ్లిక్ హెల్త్) ఉత్తీర్ణత ఉండాలి.


🔰 ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.


వయోపరిమితి: 31.01.2024 నాటికి ఓసీ అభ్యర్థులకు 42 సంవత్సరాలు; ఈడబ్ల్యూఎస్; ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 47 సంవత్సరాలు; దివ్యాంగులు 52 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 సంవత్సరాలకు మించకూడదు. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: అడకమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా.


జీతం: రూ.1,10,000. ట్రైబల్ ప్రాంతాల్లో పనిచేయువారికి అదనంగా రూ.30 వేలు ఇస్తారు. ఎపిడెమియోలజిస్ట్ పోస్టులకు రూ.60 వేలు ఇస్తారు.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 07.02.2024.


Notification


Online Application


Website


ALSO READ:


ఏపీ మెడికల్ కాలేజీల్లో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
ఏపీలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరియు టీచింగ్ హాస్పిటల్స్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 255 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (ఎండీ, ఎంఎస్‌, డీఎన్‌బీ, డీఎం) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఏపీ మెడికల్ కాలేజీల్లో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ - సూపర్ స్పెషాలిటీస్ పోస్టులు, వాక్‌ఇన్ ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీలో 169 అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ (డీఎన్‌బీ, డీఎం, ఎంసీహెచ్‌) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 6న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
వాక్‌ఇన్ వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...