Sharmila in Delhi For Special Status :  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఢిల్లీలో దీక్ష చేశారు.  పీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష చేశారు.   ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్నానరని కానీ ఇప్పటి వరకూ ఇవ్వలేదన్నారు.   ఏపీకి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ ఢిల్లీలో మహాధర్నా చేపట్టిందని షర్మిల తెలిపారు.ు  పోలవరం జాతీయ ప్రాజెక్ట్. దీంతో పాటు ఇంకా అనేక హామీలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్లు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా ఇంకా ఎన్నో హామీలు విభజన చట్టంలో ఉన్నాయి కానీ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. 


ఎన్నికల ప్రచారం సమయంలో మోదీ ఏపీలో పర్యటిస్తూ ఎన్నో హామీలు ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు.  అవన్నీ ఏమయ్యాయి? చట్ట సభలో ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా? అది ఏమైంది?  పదేళ్లు హైదరాబాద్ కామన్ క్యాపిటల్ గా ఉంచుతూ కొత్త రాజధాని నిర్మిస్తాం అన్నారు పదేళ్లు గడిచాయి. హైదరాబాద్ కామన్ క్యాపిటల్ లేకపోయింది. సొంత రాజధాని నగరం నిర్మాణం కాలేదన్నారు.  వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు. అదీ లేదు. ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు.                


ఏపీ ప్రజలు బీజేపీకి ఒక్క ఎంపీని కూడా గెలిపించలేదు. అయినా సరే ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోందన్నారు.  అన్ని పార్టీలు బీజేపీకి గులాంగిరీ చేస్తున్నాయన్నారు.  
ఉన్న ఎంపీలు అందరూ ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారు? సమాధానం చెప్పాలని  డిమాండ్ చేశారు.  ఏపీ ప్రజలను బీజేపీ కనీసం మనుషులుగా చూడడం లేదని మండిపడ్డారు.  ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వస్తాయి. తద్వారా ఉద్యోగాలు వస్తాయి. ప్రజల జీవితాలు బాగుపడతాయన్నారు.  మీ మధ్య ఉన్న ఒప్పందం ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలతో పాటు బీజేపీని డిమాండ్ చేశారు.                 


ఐదేళ్లు చంద్రబాబుకు, ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అధికారం ఇచ్చారు. ఒక్కసారి కూడా మీరు కేంద్రాన్ని నిలదీశారా? ప్రస్నించారా? ఆ దమ్ము కూడా లేకపోయిందన్నారు.  రూ. 46 లక్షల కోట్ల బడ్జెట్ లో అమరావతి రైల్వే లైన్ కోసం వెయ్యి రూపాయలు కేటాయించారు.. ఇంత మంది ఎంపీలు ఉన్నారు. మీరంతా కష్టపడి తలా 3 రూపాయలు సాధించారు అన్నమాట అని ఎద్దేవా చేశారు.  ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కొట్లాడుతూనే ఉంది...రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.  అందుకే ప్రజలు కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా సాధించే వరకు మేము పోరాడుతూనే ఉంటామన్నారు.