Job And Business Astrology: కొందరికి ఎన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా కలసిరాదు. ఏంటో ఎంత కష్టపడినా ఇలాగే ఉంటోందని బాధపడతారు. అయితే మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో అడుగుపెడితే సక్సెస్ అవుతారో ముందుగా తెలుసుకుంటే అప్పుడు పరాజయం అనేదే ఉండదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..మరి మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో ఇక్కడ తెలుసుకోండి....


అశ్విని నుంచి ఆశ్లేష  నక్షత్రాలకు సంబంధించిన వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


మూల  
ఉపాధ్యాయ, న్యాయవాది, జడ్జి, మంత్రి, ప్రభుత్వ రాయబారులు, మత సంస్థలలో ఉన్నత పదవులు, ఆయుర్వేద వైద్యులు , మందుల షాపు, డిపార్టుమెంటల్ స్టోర్స్ , పూలు పళ్ల దుకాణాలు కలిసొస్తాయి


పూర్వాషాఢ 
న్యాయవాది, బ్యాంకులు , ఆడిట్ సంస్థలు, వెల్ఫేర్ ఆఫీసులు, శిశుసంక్షేమ శాఖలు , ప్రభుత్వ వెటర్నరీ డాక్టరు, అకౌంటెంట్, రెస్టారెంట్ ,బస్ సర్వీస్ , ఎక్స్పోర్టు మార్కెటింగ్ లో బాగా రాణిస్తారు


ఉత్తరాషాఢ 
ఈ నక్షత్రం వారికి ఆయుర్వేద వైద్యం, అటార్నీ, బ్యాంకులు , న్యాయవాది,  రాయబారి, కస్టమ్స్, జైళ్ళు , ఎక్స్పోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటరు ఉద్యోగాలు కలిసొస్తాయి. ఉత్తరాషాడ మకరరాశి వారికి  రియల్ ఎస్టేట్ ,స్టీలు మెటీరియల్ సప్లై ఇంజనీరింగ్ విడి భాగాలు , మున్సిపాలిటీలో ఉద్యోగాలు మంచిది


మఖ నుంచి  జ్యేష్ఠ నక్షత్రాలకు సంబంధించిన వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


శ్రవణం
శ్రవణం నక్షత్రం వారికి గనులు , గ్రానైట్ రాళ్ళు , నూనె మిల్లులు , పెట్రోలు బంకులు కూల్ డ్రింకుల తయారీ, ఆనకట్టలకు సంబంధించిన పనులు, షిప్ లో ఉద్యోగాలు కలిసొస్తాయి. 


ధనిష్ఠ 
ఈ నక్షత్రం వారికి రక్షణ శాఖలు పెద్ద ఫ్యాక్టరీలు , ఇంజనీర్ , ప్రభుత్వ విద్యుత్ సంస్థలు , వ్యవసాయం , టీతోటలు , తోలు పరిశ్రమ , మాంస వ్యాపారం,  గణితం, జ్యోతిషం, పురావస్తుశాఖ , లైబ్రరీ , ఆస్ట్రో ఫిజిక్స్ , వ్యాయామశాఖ , ఫోటోగ్రఫీ కలిసొస్తుంది


శతభిషం
పరిశోధన,  హస్త సాముద్రికం, మందులు తయారీ,  జ్యోతిష్యం లో రాణిస్తారు


పూర్వాభాద్ర 
సాముద్రికము, జ్యోతిష్యం, ఫైనాన్స్ , బ్యాంకులు, న్యాయవాదులు, గణాంకశాఖ ,పైలట్, మిల్లులు..... పూర్వాభాద్ర మీనరాశికి చెందిన వారు రాజకీయములలో చురుకైన పాత్ర పోషిస్తారు..ఇంకా దేవస్థానాలు , ట్రావెల్ సంస్థలు , రైస్ హోల్ సేల్ , బ్యాంకులు ,  ప్రొఫెసర్ , కౌన్సిలర్, జడ్జి పదవులు వీరికి బాగా కలిసొస్తాయి


ఉత్తరాభాద్ర 
సిఐడి , రక్షణశాఖలు , రాయబారులు, ప్రభుత్వ వైద్యసంస్థలు , ఇన్సూరెన్స్, మత్స్యశాఖ , దేవాదాయశాఖ,  రెస్టారెంట్ , ఎక్స్పోర్ట్ - ఇంపోర్టు వ్యాపారాలు కలిసొస్తాయి


రేవతి 
మీ నక్షత్రం రేవతి అయితే మీరు జడ్జి, శాసనసభ్యత్వం, ప్రభుత్వ రంగంలో పెద్ద ఉద్యోగం, లాయర్లు, రాయబారులు, కస్టమ్స్ ఎక్సైజ్ శాఖ, జర్నలిజం, జ్యోతిష్యం, ఆడిట్ ,యాడ్స్, షేర్ మార్కెట్ , బ్యాంకులు , చిట్ ఫండ్స్ , ప్రింటింగ్  వృత్తుల్లో వెలుగుతారు 


ఇన్ని వృత్తులలోనూ, ప్రతివృత్తిలో స్థాయీ భేదం ఉంటుంది. అత్యున్నత స్థాయి, ఉన్నతస్థాయి మధ్యమస్థాయి, అధమస్థాయి ఉంటాయి. ఎంతమేర జాతకుడు స్థాయిని పొందగలడు అనేది వారి లగ్నాధిపతి ఆధారంగా ఉంటుంది. 


Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!


గమనిక:  ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.