Job And Business Astrology: కొందరికి ఎన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు చేసినా కలసిరాదు. ఏంటో ఎంత కష్టపడినా ఇలాగే ఉంటోందని బాధపడతారు. అయితే మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో అడుగుపెడితే సక్సెస్ అవుతారో ముందుగా తెలుసుకుంటే అప్పుడు పరాజయం అనేదే ఉండదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..మరి మీ నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో ఇక్కడ తెలుసుకోండి....


అశ్విని నుంచి ఆశ్లేష  నక్షత్రాలకు సంబంధించిన వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


మఖ
ఈ నక్షత్రం వారు న్యాయవాది, వైద్యుడు, సెక్యూరిటీ ఆఫీసరు , ప్రభుత్వ శాఖలలోను, షిప్పింగ్, రసాయనాలు, నగలు, గనులు, జర్నలిజం, సి.ఐ.డి., మెరైన్ శాఖల్లో ఉద్యోగాలు చేస్తే బాగా కలిసొస్తుంది


పుబ్బ(పూర్వ ఫల్గుణి) 
ఈ నక్షత్రానికి చెందిన వారు  వాహనాలు నడపడం, రేడియో, టీవీ, సేల్స్ మెన్, ఎలక్టికల్ షాపు, రవాణాశాఖ విద్యాబోధన ఆటో మొబైల్స్, సినిమా హాల్స్ కి సంబంధించిన ఉద్యోగాల్లో సౌకర్యవంతంగా ఉంటారు


ఉత్తర నక్షత్రం
కలెక్టర్, ఐజీ, ప్రభుత్వ శాఖలు, జ్యోతిష్యం, కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ షాపులు, భారీస్థాయిలో హోర్డ్ వేర్ షాపులు నిర్వహణ, అందులో ఉద్యోగాలు చేస్తే ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఇనుప సంబంధిత వస్తువుల తయారీ ఫ్యాక్టరీలు కూడా మీకు కలిసొస్తాయి. కన్యారాశికి చెందిన ఈ నక్షత్రం వారు జ్యోతిష్య పండితులుగా, సాముద్రికం చెప్పేవారుగా, రసాయనాలు తయారుచేయడం, లెక్చరర్లుగా, ప్రభుత్వ రాయబారిగా బాగా సక్సెస్ అవుతారు 


హస్త 
ఈ నక్షత్రం వారు న్యాయవాది, కళాకారులుగా, బట్టలషాపు, పొగాకు సంస్థలు, లాండ్రీ, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, షిప్పింగ్, నేవీ, చెరువుల వ్యాపారాల్లో రాణిస్తారు.


చిత్త 
ఈ నక్షత్రం వారు సేల్స్ టాక్స్ డిపార్టుమెంట్, అకౌంటెంట్, న్యాయసంబంధిత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తారు. గుమస్తా శాఖలు, ఇంజినీరింగ్ , అకౌంటెంట్,  తులారాశికి చెందిన చిత్త నక్షత్రం 3,4 పాదాలు అయితే మీరు ఆటోమొబైల్ స్పేర్పార్ట్స్, టైర్ రీట్రేడింగ్, ఎలక్ట్రికల్ వస్తువులు, నగలవర్తకం, న్యాయస్థానంలో విధుల నిర్వహణ, రక్షణ శాఖలు, ఇంజనీరింగ్, సాంస్కృతిక సంస్థల్లో విధులు నిర్వర్తిస్తారు. 


స్వాతి 
ఈ నక్షత్రం వారు హాస్టల్స్, వైద్య రంగం, ట్రాన్స్పోర్టు ఏజెన్సీ, ఎక్స్-రే పరికరాలు, అలంకరణ సామాగ్రి, స్త్రీల వస్తువులు - ఎగ్జిబిషన్లు నిర్వహణ, వాహనావు నడపడం, రాజకీయ రంగంలో రాణిస్తారు .


విశాఖ 
ట్రావెల్ ఏజెన్సీ, రియల్ ఎస్టేట్, నేవీ, రెవెన్యూ, బ్యాంకులు, ఫైనాన్స్ బట్టల మిల్లులు, చిట్ ఫండ్స్, పిండిమిల్లుల వ్యాపారాలు విశాఖ నక్షత్రం వారికి బాగా కలిస్తాయి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారు  ఎస్టేటు, షేర్ మార్కెట్, రసాయనాలు, మందలు తయారుచేయడం, భూస్వామి, ఇన్సురెన్స్ అధికారి, రక్షణ శాఖలు మీకు కలిసొస్తాయి. 


అనూరాధ
బట్టల మిల్లు, పెట్రోలు-డీజిల్ విక్రయం, ఎరువులు, ఇనుము, బ్రాందీ షాపులు,  ఇంజినీరింగ్ వ్యవహారాలకు సంబంధించిన వాటిలో జీవనోపాధి పొందుతారు. 


జ్యేష్ఠ నక్షత్రం 
ప్రింటింగ్ ప్రెస్, ఎలక్ట్రికల్ యాడ్స్ , వైద్యం,  కంప్యూటర్స్, టీవీలు అమ్మడం, బట్టల మిల్లులకు పరికరాలు సరఫరా చేయడంలో జీవనోపాధి పొందుతారు
 
ఇన్ని వృత్తులలోనూ, ప్రతివృత్తిలో స్థాయీ భేదం ఉంటుంది. అత్యున్నత స్థాయి, ఉన్నతస్థాయి మధ్యమస్థాయి, అధమస్థాయి ఉంటాయి. ఎంతమేర జాతకుడు స్థాయిని పొందగలడు అనేది వారి లగ్నాధిపతి ఆధారంగా ఉంటుంది. 


Also Read:  ఈ 6 రాశులవారికి ఫిబ్రవరి నెల సంతోషాన్ని, విజయాన్ని అందిస్తుంది!


గమనిక:  ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.