TS Govt Jobs : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 2910 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి తాజాగా అనుమతించింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. పశుసంవర్థక శాఖలో 294, గిడ్డంగుల సంస్థలో 50, విత్తన ధ్రువీకరణ సంస్థలో 25 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  


గ్రూప్-2, 3 ఉద్యోగాల భర్తీ 


తెలంగాణ ప్రభుత్వం మరో 2910 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చింది.  663 గ్రూప్‌-2 ఉద్యోగాలు, 1373 గ్రూప్‌-3 ఉద్యోగాల భర్తీకి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ తో ఉద్యోగాల నియామక ప్రక్రియలో 50 వేల మైలురాయిని దాటేశామని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.  సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఇచ్చిన హామీ  మేరకు గడిచిన మూడు నెలలుగా ఇప్పటి వరకు 52,460 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేశామని మంత్రి తెలిపారు. మిగతా ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. 






ఏ ఏ పోస్టుల భర్తీ 


తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ లో గ్రూప్ 2, 3 పోస్టులు భర్తీ చేస్తు్న్నారు. గ్రూప్-2 ఉద్యోగాల్లో జీఏడీ ఏఎస్‌వో పోస్టులు 165, పంచాయతీరాజ్ ఎంపీవో పోస్టులు 125, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 98, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు 97, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్టులు 59 ఉన్నాయి. 


గ్రూప్-2 లో ఇతర పోస్టులు 



  • చేనేత ఏడీవో పోస్టులు - 38  

  • ఆర్థికశాఖ ఏఎస్‌వో పోస్టులు -25  

  • అసెంబ్లీ ఏఎస్‌వో పోస్టులు-15  

  • గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ పోస్టులు- 14  

  • గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు-11  

  • ఏఎల్‌వో- 9 

  • న్యాయశాఖ ఏఎస్‌వో పోస్టులు- 6  


గ్రూప్ -3 ఉద్యోగాలు 


గ్రూప్-3 ఉద్యోగాల్లో మొత్తం 99 విభాగాధిపతులు, కేటగిరీల పరిధిలో 1,373 జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వ్యవసాయశాఖలో 199 గ్రేడ్ -2 ఏఈవో పోస్టులు, 148 ఏవో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.  



  • ఉద్యానవన శాఖలో హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు - 21  

  • సహకారశాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు -63  

  • జూనియర్ ఇన్‌స్పెక్టర్‌పోస్టులు-36   

  • పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ - 183 

  • వెటర్నరీ అసిస్టెంట్-99  


మరో 294 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  విత్తన ధృవీకరణ సంస్థలో 19 సీడ్ సర్టిఫికేషన్ అధికారి, 6 ఆర్గానిక్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. మత్య్సశాఖలో 9 ఎఫ్‌డీవో, నాలుగు ఏడీ, రెండు అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకుల పరిధిలో 12 పోస్టులు, ఇంధనశాఖలో 11 సహాయ ఎలక్ట్రికల్ పోస్టులు, గిడ్డంగుల సంస్థలో 28 ఏడబ్ల్యూఎం, 14 మేనేజర్ సహా 50 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 



ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జీవో వివరాల కోసం క్లిక్ చేయండి...


 


 Also Read: DRDO Recruitment: డీఆర్‌డీఓ -సెప్టంలో 1901 ఖాళీలు, అర్హతలివే!


 


Also Read: AP DSC Jobs: ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 టీచర్ పోస్టులు