అమ‌లాపాల్‌కు లైంగిక వేధింపులు:


నటి అమలాపాల్ లైంగిక వేధింపులకు గురయ్యారు. తన మాజీ ప్రియుడు పవీందర్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడని.. బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని అమలాపాల్ కేరళ పోలీసులను ఆశ్రయించారు. ఒకప్పుడు తామిద్దరం సన్నిహితంగా ఉన్న ఫొటోలను, వీడియోలను లీక్ చేస్తానని బెదిరిస్తున్నట్లు అమలాపాల్ తన కంప్లైంట్ లో పేర్కొంది. పవీందర్, అమలాపాల్ కొన్నాళ్లు ప్రేమలో ఉండి ఆ తరువాత విడిపోయారు. ఆ తరువాత దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలాపాల్. వీరి బంధం కూడా ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వలేదు. విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు తన మాజీ ప్రేమికుడు వేధిస్తున్నాడంటూ అమలాపాల్ కేసు పెట్టింది. అతడితో పాటు మరో పదకొండు మంది ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది. రంగంలోకి దిగిన కేరళ పోలీసులు పవీందర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మిగిలిన 11 మంది కోసం వెతుకుతున్నారు. 


పవన్ కోసం నిఖిల్ త్యాగం:


నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ2' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. తెలుగుతో పాటు నార్త్ లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతోంది. ఇండస్ట్రీ పెద్దలు ఈ సినిమాను పొగుడుతూ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా ఓ ప్రెస్ మీట్ లో సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా కలిసి 'జల్సా' సినిమాను మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 'జల్సా' సినిమాను ప్రదర్శించనున్నారు. అయితే హైదరాబాద్‌లో దేవి 70MM  థియేటర్లో నిఖిల్ సినిమా 'కార్తికేయ2' ఆడుతోంది. 


ఇదే థియేటర్లో పవన్ 'జల్సా' సినిమా వేయాలనుకుంటున్నారు అభిమానులు. దీంతో నిఖిల్ వెంటనే ఆ థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించారు. తన సినిమాను రద్దు చేసుకొని మరీ 'జల్సా' సినిమా షో వేయిస్తున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నిఖిల్ ని పొగుడుతూ మెసేజ్ లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. దేవి థియేటర్ తో పాటు సుదర్శన్ థియేటర్ లో కూడా 'జల్సా' షో వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 516 స్క్రీన్స్ లో 'జల్సా' విడుదల ఖరారైనట్లు తెలుస్తోంది. 


అవికా గోర్ ఇంట విషాదం:


కథానాయిక అవికా గోర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల్లో కీలక వ్యక్తి శనివారం మరణించారు. ''మీరిద్దరూ మమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తారని నాకు తెలుసు. స్వర్గంలో కలిసి ఉంటారని ఆశిస్తున్నాను. మా దాది (నానమ్మ) మరణించారు'' అని అవికా గోర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అవికా గోర్ నానమ్మ పేరు మంజులా గోర్. ఆవిడ ఏప్రిల్ 16, 1940లో జన్మించారు. ఆగస్టు 29న తుదిశ్వాస విడిచారు. నానమ్మ, తాతయ్యలతో చిన్నతనంలో దిగిన ఫోటోలను అవికా గోర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.