ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) పైలట్ (P1) - B350 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) తన అధికారిక వెబ్‌సైట్ https://aai.aero/లో పైలట్ (P1) – B350 పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు AAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిక్రూట్‌మెంట్ 2022 డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రిక్రూట్‌మెంట్ 2022కి చివరి తేదీ ఫిబ్రవరి 18, 2022. 


AAI రిక్రూట్‌మెంట్ 2022 : అర్హతలు 


దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌(Notification)లో పేర్కొన్న విధంగా అర్హతతో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుండి 10+2 (భౌతికశాస్త్రం, గణితం) ఉండాలి. భారతదేశంలోని DGCA జారీ చేసిన ఏటీపీఎల్ ప్రకారం మల్టీ ఇంజిన్‌లో కనీసం 1000 ఫ్లయింగ్ అనుభవం ఉండాలి. డీజీసీఏ ప్రకారం ప్రస్తు ఎఫ్ఆర్టీవో, ఐఆర్ ఆమోదం, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన RTR (A) లేదా RTR (P) లేదా RTR(C) ఉండాలి. డీజీసీఏ జారీ చేసిన క్లాస్-I మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్, వ్యాలిడ్ ఈఎల్ఫీ ఉండాలి. అభ్యర్థులు భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండాలి. లేకుంటే పాస్ పోర్టు దరఖాస్తు చేసినట్లు ఏదైనా రుజువు జతచేయాలి. ఇంటర్వ్యూ తేదీ, సమయం అభ్యర్థులకు మెయిల్/కాల్ ద్వారా తెలియజేస్తారు. అభ్యర్థులు ఇంటర్వ్యూ ఆధారంగా సమర్పించిన పత్రాల భౌతిక ధ్రువీకరణ కోసం అభ్యర్థులను పిలవబడతారు. కనీసం 2000 విమాన ప్రయాణ గంటలు,  మల్టీ ఇంజిన్‌లో కనీసం 1000 ఫ్లయింగ్ గంటల అనుభవం ఉంటాలి.  


ఎలా దరఖాస్తు చేయాలి?



  • అధికారిక వెబ్‌సైట్-www.aai.aero సందర్శించండి

  • దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన వివరాలను పూరించండి

  • స్కాన్ చేసిన పత్రాలను అటాచ్ చేయండి.

  • అవసరమైన పత్రాలను fiuops@aai.aeroకి ఇమెయిల్ ద్వారా పంపండి


ఎంపిక ప్రక్రియ, జీతం


దరఖాస్తులను సమీక్షించిన తర్వాత అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేస్తారు. తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ, సమయం అభ్యర్థులకు మెయిల్/కాల్ ద్వారా తెలియజేస్తారు. సమర్పించిన పత్రాల భౌతిక ధ్రువీకరణ కోసం అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు జీతం రూ. 85000 నుంచి రూ.1 లక్ష వరకు జీతం ఇస్తారు. 


Also Read: గుడ్ న్యూస్ చెప్పిన ఇన్ఫోసిస్, ఈ ఏడాది 55 వేల మందికి ఉద్యోగాలు