పసుపు ఆరోగ్యానికి మంచిదని మనలో చాలా మందికి తెలుసు. ప్రతి రోజూ పసుపు పాలు లేదా గోరు వెచ్చని పసుపు పాలు తాగడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా పసుపు ఎంతో మేలు చేస్తుంది. పసుపు చేసే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. 


* గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉంటే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను రిపేర్ చేయడంలో సాయపడతాయి. 


* కాలేయ సమస్యతో బాధపడేవారు పసుపు నీటిని తాగాలి. ఇది వారికి ఓ ఔషధంలా పని చేస్తుంది. పసుపు విష పదార్థాలను బయటకు పంపడానికి చక్కగా పని చేస్తుంది. 


Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం


* చర్మ సమస్యలను తొలగించడానికి పసుపు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మరసం, తేనెతో పసుపు కలిపి ముఖానికి రాసుకోవచ్చు. దీనివల్ల చర్మంపై ముడతలు తగ్గుముఖం పడతాయి. 


* చుండ్రు సమస్య ఉంటే… ఏవేవో షాంపూలు వాడతారు. అలా కాకుండా ఈసారి ఇలా చేసి చూడండి. కొబ్బరి నూనెలో కొంచెం పుసుపు వేసి బాగా కలిపి ఆ నూనెను తలకు పట్టించండి. అరగంట తర్వాత తలస్నానం చేయండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.  


* రోజూ పసుపు నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.


* కీళ్ల నొప్పులు, ఇతరత్రా నొప్పుల నివారణకు పసుపు తైలం బాగా పనిచేస్తుంది. నొప్పి ఉన్నచోట ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే నయం అవుతుంది. కండరాల నొప్పికి కూడా ఈ నూనె రాస్తే ఉపశమనం కలుగుతుంది. 


* పసుపు పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పులు, దగ్గు, జలుబు, తలనొప్పి తగ్గుతాయి. కామెర్లు దరిచేరకుండా అరికడుతుంది.


* పీరియడ్స్ సమయంలో కలిగే పొత్తి కడుపు నొప్పి కూడా పసుపు పాలు తాగితే తగ్గుతుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి