Health Tips: వర్షాకాలం వానలతో పాటు ఇన్ఫెక్షన్లను కూడా వెంట తీసుకుని వస్తుంది. సాధారణ ఫ్లూ నుంచి  డెంగ్యూ, చికున్ గున్యా వంటి వైరల్ జ్వరాల వరకు రకరకాల ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు చాలా ఎక్కువగా విస్తరిస్తున్నాయి. చాలా మందిలో ఈ విష జ్వరాలు వచ్చి తగ్గిన తర్వాత చాలా రోజులపాటు కీళ్ల నొప్పులు వేధిస్తుంటాయి. కొంత మందిలో అయితే జ్వరానికి ముందే నొప్పులు మొదలవుతాయి. ఇలా జరగడానికి సాధారణంగా మన శరీరంలో ఉండే నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్ కు వ్యతరేకంగా పనిచేసేందుకు వీలుగా కొంచెం ఎక్కువ స్పందించడం మొదలు పెడుతుంది. ఇది ఒక స్థాయిలో మన శరీర కణాల మీదే పనిచేస్తుంది. చెప్పాలంటే ఇదొక తాత్కాలిక ఆటోఇమ్యూన్ కండిషన్ లాంటిదే అన్న మాట. ఈ నొప్పులకి కొన్ని ముఖ్యమైన కారణాలు ఇలా ఉన్నాయి:


వైరల్ ఇన్ఫ్లమేషన్


వైరస్‌కు వ్యతిరేకంగా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ  పనిచేసే సమయంలో ఇన్ఫ్లమేషన్  కలిగించే ఎంజైమ్స్ విడుదల అవుతాయి. ఈ ఎంజైములు కీళ్ల చుట్టూ ఉండే కండర కణజాలాలను ప్రభావితం చేసి నొప్పికి కారణమవుతుంది.


ఆటో ఇమ్యూన్ ప్రతిస్పందన


కొంతమంది వ్యక్తుల్లో వైరల్ ఇన్ఫెక్షన్ సోకినపుడు నిరోధక వ్యవస్థ చాలా చురుకుగా మారుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఇలా చురుకుగా మారిన ఇమ్యూన్ సిస్టమ్ ప్రమాదకరమైన కణాలకి కీళ్ల కణజాలాలకు మధ్య తేడా గుర్తించడంలో విఫలం అవుతుంది. కీళ్ల ను లక్ష్యం చేసుకుని దాడి చేస్తుంది.  దీని వలన కీళ్లలో నొప్పి, వాపు వస్తాయి. దీపిపి "పోస్ట్-వైరల్ ఆర్ట్రైటిస్" (Post-viral arthritis) అని అంటారు.


వైరల్ ఆర్ట్రైటిస్


చికున్గున్యా, డెంగీ, కొన్ని వైరస్‌లు నేరుగా కీళ్లపై ప్రభావం చూపించి, నొప్పికి కారణం అవుతాయి. ఈ నొప్పి వైరస్ తగ్గిన తర్వాత కూడా కొన్ని వారాల పాటు కొనసాగవచ్చు.


Also Read: 15 ఏళ్ల కిడ్స్​లో పెరుగుతోన్న లైంగిక సమస్యలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO.. కారణమిదే


నీరు, మినరల్స్ లోపం


వైరల్ ఫీవర్ సమయంలో డీహైడ్రేషన్ అవుతుంది. ఇది ఎక్కువైనపుడు ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కోల్పోతాయి. ఈ కారణాలతో కండరాలు మరియు కీళ్లలో నొప్పి వస్తుంది. అందుకే శరీరంలో ఇన్ఫెక్షన్ ఉన్నపుడు తప్పనిసరిగా నీళ్లు, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.


కండరాల బలహీనత 


వైరల్ ఫీవర్ సమయంలో శరీరం చాలా శక్తిని కోల్పోయి బలహీన పడుతుంది.  దీని వలన ముఖ్యంగా కండరాలు బాగా అలసిపోతాయి. కీళ్లలో బలహీనత వస్తుంది, ఫలితంగా కండరాలు, కీళ్లలో నొప్పిగా నిపిస్తుంది.


ఈ నొప్పి నుంచి వేడి లేదా చల్లని కాపడం పెట్టుకుంటే ఉపశమనం దొరుకుతుంది. నొప్పి మరీ తీవ్రంగా ఉన్నపుడు పారసిటమాల్ మాత్రలు రెండు పూటల వేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ కీళ్ల నొప్పులు సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల్లో తగ్గిపోతాయి. కొంత మందిలో  ఎక్కువకాలం కీళ్ల నొప్పి కొనసాగితే, డాక్టర్‌ను సంప్రదించడం మంచిది, ఎందుకంటే ఈ ఇన్ఫ్లమేషన్  ఇతర ఆనారోగ్య సమస్యల సూచన కావచ్చు. కాబట్టి తప్పకుండా ఆర్థోపెడిక్ డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం అవసరమని గుర్తించాలి.


Also Read: 2030 నాటికి 45 శాతం మహిళలు సింగిల్​గా ఉంటారట.. పిల్లలు కూడా ఉండకపోవచ్చు.. కారణమిదే