బరువు మగవారితో పోలిస్తే ఆడవారినే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మగవారు బరువు పెరగడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఆడవాళ్లు కొన్ని నెలల్లోనే బరువు పెరిగి చాలా లావుగా కనిపిస్తారు. ఆడవారు శారీరక శ్రమ తక్కువగా చేస్తారు కాబట్టి బరువు పెరుగుతారని కొంతమంది భావిస్తే, మరికొంతమంది పిల్లలు పుట్టాక ఆడవాళ్లు బరువు పెరగడం సహజమే కదా అని తేలికగా తీసుకుంటారు. కానీ అసలు మగవారి కన్నా ఆడవారే ఎందుకు ఎక్కువ బరువు పెరుగుతారో అని ఆలోచించారా? దానికి కారణం ఒక హార్మోన్. 


హార్మోన్ అనగానే ఆడవారికి గుర్తొచ్చేది ఈస్ట్రోజెన్. ఇదే కదా ఆడవారిలో ఉండేది. దీని వల్ల ఒళ్లు పెరుగుతుందనుకుంటారు కానీ, మహిళలు బరువు పెరగడానికి కారణం ఈస్ట్రోజెన్ కాదు... టెస్టోస్టెరాన్.  ఈ హార్మోన్ మగవారిలో అధికంగా ఉంటుంది. పురుషుల వృషణాలలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఇది. మగవారిలో ఎముక సాంద్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. కొవ్వును అవయవాలకు చేరవేయడం, కండరాలకు బలం ఇవ్వడం వంటి విషయాల్లో కూడా సాయపడుతుంది. ఈ హార్మోన్ కేవలం మగవారిలోనే కాదు, ఆడవారిలో కూడా ఉంటుంది. కాకపోతే తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ హార్మోనే ఆడవారిలో బరువు పెరగడానికి కారణం అవుతోంది. ఇది మహిళల్లో ఎక్కువ అయినప్పుడు పొట్ట దగ్గర కొవ్వు చేరిపోతుంది, అలాగే ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. 


టెస్టోస్టెరాన్ ఉత్పత్తి శరీరంలో పెరిగితే ఆడవారిలో PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వస్తుంది. దీనివల్ల ఆడవారిలో గడ్డాలు, మీసాలు రావడం, రుతుక్రమం గతి తప్పడం, రుతుస్రావం సమయంలో నొప్పి, బరువు పెరిగిపోవడం, పిల్లలు కలగకపోవడం వంటి సమస్యలు వస్తాయి.  అండాశాయల్లో తయారయ్యే ఆండ్రోజెన్లు అండోత్సర్గాన్ని బలహీనపరుస్తాయి. మొత్తమ్మీద స్త్రీ భారీ మార్పులనే చూపిస్తుంది టెస్టోస్టెరాన్. 


గర్భనిరోధక మాత్రలు...
కొన్ని రకాల గర్భనిరోధక మాత్రల్లో ఉండే టెస్టోస్టెరాన్లు బరువు పెరగడానికి, ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేస్తాయి. అందుకే గర్భినిరోధక మాత్రల మీద ఉండే మహిళలు కాస్త బొద్దుగా ఉంటారు. వాటిని వాడడం ఆపేశాక కూడా ఆ ప్రభావం చాలా ఏళ్ల పాటూ కొనసాగుతుంది. 


Also read: ఆ ప్రదేశం 50 ఏళ్లుగా మండుతూనే ఉంది, అదే నరకానికి ముఖ ద్వారం




































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.