వేడి వాతావరణంలో సూక్ష్మ జీవుల వ్యాప్తి తక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ కొన్ని రకాల బ్యాక్టీరియాలు వేసవిలో చాలా విస్తృతంగా వ్యాపిస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి లాజియోనెల్లా అనే బ్యాక్టీరియా.

  లెజియోనైర్స్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లెజియోనెల్లా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా కలిగిన డ్రాప్లెట్స్ ను పీల్చుకోవడం ద్వారా ఆ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ లెజియోనెల్లా బ్యాక్టీరియా జాకూజీలు, హాట్ టబ్స్, కుళాయిలు, షవర్ హెడ్స్ ఇతర తడిగా ఉండే గార్డెన్ పాటింగ్ కంపోస్టుల్లో కూడా వీటి సంఖ్యను పెంచుకోగలవు. గార్డెనర్ వాటర్ క్యాన్స్, స్పిక్లర్లు, హాస్పైప్స్ లో దాగి ఉంటుంది.


వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులకు ఇది త్వరగా సంక్రమిస్తుందని చెప్పవచ్చు. వృద్ధులు, పొగతాగే అలవాటు ఉన్నవారిలో నిరోధక వ్యవస్థ  సహజంగానే బలహీనంగా ఉంటుంది. కనుక వీరికి త్వరగా ఈ ఇన్ఫెక్షన్ సోకవచ్చు. లెజియోనెల్లా బ్యాక్టీరియా పాంటియాక్ ఫీవర్ కు కూడా కారణం కావచ్చు. ఫ్లూ లాగే అనిపించే తేలిక పాటి అనారోగ్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా దానికదే తగ్గిపోతుంది. కానీ లేజియోనైర్స్ వ్యాధి మాత్రం సరైన సమయంలో చికిత్స అందక పోతే ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. చికిత్సతో వ్యాధి నయం అయినప్పటికీ కొందరిలో తర్వాత కూడా సమస్యలు అలాగే ఉండిపోతాయి.  


బ్రిటన్ లో ఐదుగురు ఈ ఇన్ఫెక్షన్ బారిన పడిన తర్వాత ఒక కంపెనీని ప్రాసీక్యూట్ చేసిన తర్వాత బ్రిటన్ ఆరోగ్య వ్యవస్థ ఈ విషయాన్ని గురించిన హెచ్చరికలు జారీ చేసింది. వీరిలో ఒకరికి ఇంటెన్సివ్ కేర్ అవసరం పడింది. వేడి వాతావరణంలో సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందే ప్రమాదం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించింది.


లెజియోనైర్స్ ఇన్ఫెక్షన్ ఫ్లూ లక్షణాల మాదిరిగానే ఉంటాయి. తలనొప్పి, కండరాల నొప్పి, జ్వరం, అలసట, చలిగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన మొదట్లో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పటికీ ఇన్ఫెక్షన్ ఊపిరి తిత్తులకు చేరినపుడు మాత్రం న్యూమోనియా వంటి లక్షణాలు కనబరుస్తుంది. ఈ స్థాయిలో ఛాతిలో నొప్పి, నిరంతరాయంగా దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.


అయితే ఈ వ్యాధిని సమర్థవంతంగా నివారించడం సాధ్యమే అని నిపుణులు సూచిస్తున్నారు. లేజియోనైర్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా హాట్ టబ్లు, స్పాలలో క్లోరిన్ వంటి క్రిమి సంహారకాలు అవసరమయ్యే స్థాయి పీహెచ్ లో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఈ వ్యాధి సోకిన తర్వాత జీవితం ఎంత నరకప్రాయంగా మారిందో ఒక ఓ బాధితురాలు యూకే మీడియాకు వెల్లడించింది.


HSE Riaar Plastics Limited అనే కంపెనీలో ఐదుగురు ఈ వ్యాధి బారిన పడిన తర్వాత అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడి కూలింగ్ టవర్ల నిర్వహణ సరిగ్గా లేనట్టు కనుగొన్నారు. ఐదుగురిలో ఒకరిని ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స అందించాల్సి వచ్చింది. కంపెనీకి భారీ మొత్తంలో జరిమానా విధించారు.


హాట్ టబ్ లు, షవర్ హ్యాండిల్స్ ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వ్యాధి గురించి అత్యవసర హెచ్చరికలు కూడా బ్రిటన్ ఆరోగ్యశాఖ వెలువరించింది. ఇన్ఫెక్షన్ సోకినట్టు అనుమానం కలిగితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని, వెంటనే చికిత్స పొందాలని పేర్కొంది.


Also read : గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.