బీపీ, కొలెస్ట్రాల్ వంటి లైఫ్‌స్టైల్ జబ్బులు ఈ మధ్య చాలా సాధారణమైపోయాయి. ఈ సమస్యలతో దీర్ఘకాలికంగా బాధ పడేవారు గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. చాలా మందిలో రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వల్ల హార్ట్ ఎటాక్ ల బారిన పడుతున్నారు. వీరికి సాధారణంగా స్టంట్స్ అమర్చడం ద్వారా చికిత్స అందిస్తారు. ఈ చికిత్సలు చాలా కాలం పాటు ఫలితాలు ఇవ్వడం లేదని నిపుణులు అభిప్రాయపడతున్నారు. త్వరలోనే మరిన్ని రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. సమస్య తిరగ బెడుతున్న సందర్బాలు కోకొల్లలు. కొంత మందికి తిరిగి చికిత్స చేయించుకునే అవకాశం ఉంటుంది. కానీ చాలామందిలో ఇలా సమస్య తిరగబడడం మరణానికి కారణం అవుతోంది. ఈ పరిస్థితి ఏర్పడకుండా నివారించేందుకు రకరకాల జాగ్రత్తలు చెబుతుంటారు. జీవన శైలి లో మార్పులు, ఆహారవిహారాల్లో మార్పులు, ప్రత్యేక వ్యాయామాలు వంటి రకరకాల పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిని నివారించే ఒక పరిశోధన మంచి ఫలితాలను కనబరుస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.


బీపీ తగ్గించే ఈ పర్పుల్ రంగు జ్యూస్ లో నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తనాళాలు విశాలంగా ఉండడానికి రక్త ప్రవాహం మెరుగుపరచడంలో సహాయపడతాయని పరిశోధకులు అంటున్నారు. లండన్ లోని క్వీన్ మేరీ యూనివర్సిటికి చెందిన డాక్టర్ కృష్ణ రాజ్ రాథోడ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ‘‘ఈ చికిత్స పూర్తిగా సహజమైన ఉత్పత్తి, ఇది అందరికి బాగా నచ్చింది కూడా, అదీ కాకుండా దీనితో ఎలాంటి దుష్ప్రభావలు ఉండవు’’ అని అన్నారు.


గుండె వాల్వులకు స్టెంట్లు వాడిన వారిలో అవి ఎక్కువ కాలం పాటు మన్నేందుకు కూడా బీట్ రూట్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. త్వరలోనే వైద్యులు కూడా దీనిని రోగులకు సిఫారసు చేస్తారని ఆశిస్తున్నామని, ఈ పరిశోదనను తదుపరి ట్రయల్స్ కు తీసుకువెళ్తామని ఆ పరిశోధనలో పాల్గొన్న నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. గుండె సమస్యలతో బాధపడుతున్న వారిలో చాలామంది స్టెంట్ లను అమర్చడం ద్వారా చికిత్సలు తీసుకుంటున్నారు. కానీ అవి చాలా వరకు విఫలమవుతున్నాయి. ఇలా విఫలం కాకుండా దీర్ఘకాలికంగా ఈ చికిత్సలు ఫలితాలను అందించాలంటే ఇలాంటి కొన్ని ప్రత్యామ్నాయ చికత్సలను కూడా ప్రారంభించాలి. ఇప్పుడు మొదలయిన ఈ అధ్యయనం మరిన్ని ఫలితాలను నిర్ధారించేందకు కొంత వరకు ఈ ప్రక్రియను స్కేల్ – అప్ చెయ్యాల్సిన అవసరం ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు.


కనుక ఇక నుంచి ప్రతి రోజూ పొద్దున్నే మొదటి డ్రింక్ గా టీ తాగే అలవాటు మాదిరిగానే రోజుకు ఒక 70 మి.లీ. ల బీట్ రూట్ జూస్ తాగే అలవాటు చేసుకుంటే గుండె సమస్యలున్న వారి జీవితకాలాన్ని గణనీయంగా పెంచే అవకాశాలు మాత్ర ఉన్నాయని ఈ అధ్యయనం నిరూపిస్తోంది.


Also read : డయాబెటిస్ ఉందా? మీ గుండె జాగ్రత్త, నిశబ్దంగా చంపేస్తుందట!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.