తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య ఆధారిత కోర్సులో చేరిన విద్యార్థులకు మొదటి నెల నుంచి రూ.10,000 వేతనం అందుకునే అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చొరవ చూపినా.. కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రంలో 66 ప్రైవేట్‌, 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బీబీఏ (రిటైలింగ్‌), బీబీఎస్‌(ఈ కామర్స్‌), బీబీఏ(లాజిస్టిక్స్‌), బీఎస్‌సీ ఫిజికల్‌ సైన్స్‌, బీఏ (కంటెంట్‌ అండ్‌ క్రియేటివ్‌ రైటింగ్‌), బీకాం (ఈ కామర్స్‌), బీకాం (హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌)తో పాటు మరికొన్ని కలిపి మొత్తం 10 కోర్సులకు అనుమతి ఇవ్వాలని విద్యామండలి నిర్ణయించింది.


ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మూడు రోజులు కళాశాలల్లో పాఠాలు వినాలి...మరో మూడు రోజులు తమ కోర్సుకు అనుగుణంగా కేటాయించిన పరిశ్రమలు, స్టోర్లలో ఇంటర్న్‌షిప్‌ చేయాలి. అందుకు ఆయా పరిశ్రమలు లేదా స్టోర్లు రూ.10 వేల చొప్పున స్టైపెండ్‌ అందిస్తాయి. కోర్సులను మంజూరు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా ప్రైవేట్‌ నుంచి 21 కళాశాలలు, కళాశాల విద్యాశాఖ పరిధిలో మరో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు దరఖాస్తు చేశాయి. కొన్ని చోట్ల పరిశ్రమలు లేకపోవడం, ఒకవేళ ఆ కోర్సుల్లో చేరితే విద్యార్థుల ఇతర పరీక్షలకు ఇబ్బంది అవుతుందని భావించి కళాశాలలు ముందుకు రాలేదని భావిస్తున్నారు. 


Also Read:


సివిల్స్‌ శిక్షణ కోసం దరఖాస్తుల ఆహ్వానం, వీరు అర్హులు!
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఎస్టీ స్డడీ సర్కిల్‌లో సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ కోసం ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉండి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సీశాట్‌-2024 పరీక్ష ద్వారా ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. సరైన అర్హతలు కలిగినవారు జూన్‌ 9 నుంచి జులై 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఎస్టీ స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి హాస్టల్ వసతి కూడా ఉంటుంది. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.. 


జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!
ఏపీలోని బీఈడీ, స్పెషల్‌ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏపీ ఎడ్‌సెట్‌-2023 పరీక్షను జూన్ 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూన్‌ 15, తెలంగాణ విద్యార్థులు జూన్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌‌కు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌‌లు అందచేస్తారు. 
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..