నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ) 2023 ఫలితాలు వెలువడ్డాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జూన్ 7న ఫలితాలను వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు పొందవచ్చు. ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ 2023 ప్రవేశ పరీక్షను మే 14, 2023న దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో సీబీటీ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా దేశంలోని 21 కేంద్రీయ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థలు, 25 రాష్ట్ర స్థాయి హోటల్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో, ఒక పబ్లిక్ సెక్టార్ ఇన్‌స్టిట్యూట్, మరో 24 ప్రైవేట్ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థల్లో బీఎస్సీ హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
కోర్సు వివరాలు..
బీఎస్సీ హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ ఉమ్మడిగా అందిస్తున్నాయి. ఈ కోర్సు 3 ఏళ్ళ నిడివితో 6 సెమిస్టర్లుగా ఉంటుంది. ఈ కోర్సు హాస్పిటాలిటీ సెక్టరుకు సంబంధించి విభిన్న అంశాలతో కూడిన పూర్తి ప్రొఫిషినల్ నాలెడ్జ్ అందిస్తుంది.
కోర్సులోని అంశాలు..
ఈ ప్రోగ్రామ్‌లో ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్, హౌస్ కీపింగ్, హోటల్ అకౌంటెన్సీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, టూరిజం మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలు బోధిస్తారు. ల్యాబ్ వర్క్‌లు కూడా ఉంటాయి. అంతే కాకుండా హోటల్ అకౌంటెన్సీ, ఫుడ్ సేఫ్టీ క్వాలిటీ, హ్యూమన్ రిసోర్సు మేనేజ్‌మెంట్, ఫెసిలిటీ ప్లానింగ్, ఫైనాన్సిల్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ మరియు టూరిజం మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ అంశాల్లో శిక్షణ అందిస్తారు.
పరీక్ష ఇలా..
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఎన్‌సీహెచ్‌ఎం జేఈఈ-2023 పరీక్ష నిర్వహించారు. మొత్తం 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడిగారు. ఇందులో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ఒక్కోదానిలో 30 ప్రశ్నలు; ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 60 ప్రశ్నలు; ఆప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ నుంచి 50 ప్రశ్నలు అడిగారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయించారు. తప్పుగా గుర్తించిన సమాధానానికి ఒక మార్కు కోత విధించారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడిగారు.
Also Read:
జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!
ఏపీలోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు 'ఏపీ ఎడ్‌సెట్-2023 పరీక్షను జూన్ 14న నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్‌సెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజేంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 14న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్‌టికెట్, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 23న ముగియనున్నాయి. అంటే ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.ఈ ఏడాది జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2024 ఏప్రిల్ 23తో విద్యాసంవత్సరం ముగియనుంది.
కొత్త విద్యాసంవత్సరం క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..