నాయిస్ బడ్స్ ట్రాన్స్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. దీని ధర రూ.1,000 లోపే నిర్ణయించారు. నాయిస్ అనేది ఒక ఇండియన్ బ్రాండ్. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీతో ఇది అందుబాటులోకి వచ్చింది. ఏకంగా 45 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుంది.
నాయిస్ బడ్స్ ట్రాన్స్ ధర
నాయిస్ బడ్స్ ట్రాన్స్ ధరను రూ.999గా నిర్ణయించారు. గోనాయిస్ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. జెట్ బ్లాక్, స్నో వైట్, స్పేస్ బ్లూ, ట్రూ బ్లూ, ట్రూ పర్పుల్ రంగుల్లో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. బౌల్ట్ ఆడియో ఎయిర్ బేస్ వై1, బోట్ ఎయిర్‌డోప్స్ 111లతో ఇది పోటీ పడనుంది.
నాయిస్ బడ్స్ ట్రాన్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇవి బీన్స్ తరహా డిజైన్‌తో మార్కెట్లో లాంచ్ అయ్యాయి. 6 ఎంఎం డ్రైవర్‌ను ఇది అందించనున్నారు. ఏఏసీ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. గేమింగ్ కోసం ఇందులో లో లేటెన్సీ అందుబాటులో ఉంది. వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్5 రేటింగ్ కూడా అందించారు.
దీంతోపాటు కొత్తగా లాంచ్ అయిన నాయిస్ బడ్స్ ట్రాన్స్ బ్లూటూత్ వీ5.3 వెర్షన్‌ను సపోర్ట్ చేయనున్నాయి. గేమింగ్ విషయానికి వస్తే... ఇవి లో లేటెన్సీ మోడ్‌ను ఆఫర్ చేయనున్నాయి. 10 మీటర్ల దూరం వరకు ఇవి కనెక్టివిటీని అందించనున్నాయి.
బ్లూటూత్ వీ5.3 కనెక్టివిటీని ఇందులో అందించారు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మొత్తంగా 45 గంటల ప్లేటైంను ఇవి సపోర్ట్ చేయనున్నాయి. ఇన్‌స్టా ఛార్జ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా 10 నిమిషాల ఛార్జింగ్‌తో 200 నిమిషాల ప్లేటైం లభించనుంది. యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఎల్ఈడీ ఛార్జింగ్ ఇండికేటర్ ఉండనుంది.
నాయిస్ గతంలో నెర్వ్ ప్రో అనే నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ధర రూ.999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఇయర్‌ఫోన్స్ కొనుగోలు చేయవచ్చు. సియాన్ బ్లూ, నియో గ్రీన్, జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.
బ్లూటూత్ వెర్షన్ 5.2 కనెక్టివిటీ ఆప్షన్‌తో నాయిస్ నెర్వ్ ప్రో నెక్‌బ్యాండ్ స్టైల్ ఇయర్‌ఫోన్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. వీటిలో డ్యూయల్ పెయిరింగ్ ఫీచర్ కూడా ఉంది. అంటే ఒకేసారి రెండు డివైస్‌లకు ఈ ఇయర్‌ఫోన్స్‌ను కనెక్ట్ చేసుకోవచ్చన్న మాట. వీటి వైర్‌లెస్ రేంజ్ 10 మీటర్లుగా ఉండటం విశేసం. ముఖ్యంగా ఈ ఇయర్‌ఫోన్స్‌కు బ్యాటరీ మెయిన్ హైలెట్. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 35 గంటల ప్లేబ్యాక్ టైం లభిస్తుందని కంపెనీ అంటోంది. కేవలం 10 నిమిషాల చార్జ్‌తోనే 10 గంటల పాటు మ్యూజిక్ లేదా వీడియో కంటెంట్‌ను వీటి ద్వారా ఎంజాయ్ చేయవచ్చు.
కాల్స్ మాట్లాడేందుకు ఇన్‌లైన్ కంట్రోల్స్ ఉన్న మైక్రోఫోన్‌ను నాయిస్ నెర్వ్ ప్రో అందిస్తుంది. మన చుట్టూ పరిసరాల్లో ఎన్ని శబ్దాలు ఉన్నా ఇబ్బంది కలగకుండా ఎన్విరాన్‌మెంటర్ సౌండ్ రిడక్షన్ (ఈఎస్ఆర్) అనే కొత్త టెక్నాలజీతో ఈ ఇయర్‌ఫోన్స్ వస్తున్నాయి. బయటి ప్రాంతాల్లో కాల్స్ మాట్లాడే సమయంలో ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. ఈ ఇయర్‌ఫోన్స్‌లో మ్యాగ్నిటిక్ ఇయర్‌బడ్స్‌ను అందించారు. స్వెట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IPX5 రేటింగ్ కూడా ఇందులో ఉంది. అంటే చెమట, నీటి తుంపరలు వీటిపై పడినా ఏమీ కాదన్న మాట.
Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?