రోజంతా శరీరం ఉత్తేజంగా పని చేయాలంటే పరగడుపున తినే ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అల్పాహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వారు పొట్ట నిండడమే కాదు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. అల్పాహారంలో షుగర్ స్థాయిలను అధికంగా చేసే ఫుడ్ ను తింటే రోజంతా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మధుమేహం ఉన్నవారు ఉదయానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అధికంగా కలిగి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మన కాలేయం అదనపు గ్లూకోజ్‌ని ఉత్పత్తి చేస్తుంది. మీకు దాహంగా అనిపించినా, అతిగా మూత్ర విసర్జన చేసినా, ఉదయాన్నే చూపు మందగించినట్టు అనిపించినా... మీ రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నట్టు లెక్క. కాబట్టి ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పరగడుపునే తినాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే.
1. ఉదయాన పరగడుపున ఒక స్పూను ఆవు నెయ్యిలో చిటికెడు పసుపు పొడి కలుపుకొని తినేయాలి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా రోజంతా కాపాడడంలో ముందుంటుంది. అలాగే తీపి పదార్థాలు తినాలన్న కోరికలను కూడా నియంత్రిస్తుంది. నెయ్యి పొట్ట నిండిన భావనను పెంచితే, పసుపు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.
2. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సిడర్ వెనిగర్ తాగిన మంచిదే. లేదా ఒక స్పూన్ ఉసిరి రసం తాగిన ఉత్తమమే. ఇది లేకుంటే గ్లాసు నీటిలో నిమ్మరసం కలిపి పరగడుపున తాగేయండి. ఈ ద్రావకాలు శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావాన్ని చూపిస్తాయి. శరీరాన్ని ఆల్కలీన్గా ఉంచడానికి ఈ ద్రవ పదార్థాలను ఎంచుకోవచ్చు.
3. దాల్చిన చెక్క వల్ల మధుమేహలుకు ఎంతో ఉపయోగం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే ఒక మసాలా. రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. దాల్చిన చెక్కతో టీ చేసుకుని తాగితే మంచిది.
4. మెంతి నీరు మధుమేహలకు నిజంగానే సూపర్ ఫుడ్. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం కార్బోహైడ్రేట్లను శోషించుకోకుండా కాపాడుతుంది. ఒక టీ స్పూన్ మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి ఉదయం లేచాక ఆ నీటిని తాగేయాలి. ఆ గింజలను కూడా నమిలి మింగేయాలి. ఇలా నెల రోజులు చేస్తే చాలు పూర్తిగా అదుపులోకి వచ్చేస్తుంది.
5. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితేనే కాదు తగ్గితే కూడా సమస్యే. అలా తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇందుకోసం ప్రోటీన్ నిండిన ఆహారాన్ని పరగడుపున తినాలి. రాత్రి నానబెట్టిన బాదం పప్పును, ఉదయం తినాలి. వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉదయం పూట ఖాళీ పొట్టతో టీ లేదా కాఫీ తినడం మంచిది కాదు.
Also read: వేసవిలో జ్వరాన్ని తట్టుకునే శక్తి కావాలంటే అప్పుడప్పుడు చెరుకు రసం తాగాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.