Self-Massage For Anxiety: ఆందోళన రోజూవారీ జీవితంలో చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. పనులకు ఆటంకాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. తద్వారా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. అలా జరగకుండా, యాంగ్జైటీ వచ్చినపుడు ఉపశమనం కలిగించటానికి సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు. మన శరీరంలోనే చాలా ప్రెషర్‌ పాయింట్స్‌ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా వరకు ప్రెషర్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. 


చిన్న చిన్న ఆందోళనలు దైనందిన జీవితంలో సహజమే కానీ, విపరీతమైన ఒత్తిడి రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. 


ఒత్తిడి లక్షణాలు:


1. తరచుగా పానిక్ అవటం, ఏదో ఒకదానికి ఆందోళన చెందటం, భయపడటం.
2. దేని మీదా ఫోకస్ చేయలేకపోవటం
3. గాబరా పడటం
4. తలనొప్పి, జీర్ణసమస్యలు
5. నిద్రలేమి
6. అలసట
7. కండరాల బలహీనత


ఏ ప్రెషర్ పాయింట్స్ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి?


ఆందోళన కోసం ప్రెషర్ పాయింట్ల ప్రభావాన్ని సమర్ధించే విస్తృతమైన శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, కొందరు వ్యక్తులు ఆక్యుప్రెషర్,  రిఫ్లెక్సాలజీ వంటి పద్ధతుల ద్వారా ఉపశమనం పొందుతారు. ఈ 10 ఒత్తిడి పాయింట్లు ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయని కొందరు నమ్ముతారు. 


1. థర్డ్ ఐ పాయింట్ (GV24.5) : కనుబొమ్మల మధ్య, ముక్కు పైన నుదిటిని కలిసే ఇండెంటేషన్‌లో ఈ పాయింట్ ఉంటుంది. కొన్ని నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ, సున్నితంగా ఒత్తితే కాస్త రిలీఫ్ ఉంటుంది. .


2. యూనియన్ వ్యాలీ (LI4) : బొటనవేలు , చూపుడు వేలు మధ్య వెబ్‌బింగ్‌లో ఉంటుంది. గట్టిగా ఒత్తిడిని కలిగించి, కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయండి.


3. పెరికార్డియం పాయింట్ (P6) : మణికట్టు లోపలి భాగంలో, అరచేతి దిగువన మూడు వేళ్ల వెడల్పుచూసుకొని అక్కడ మీ బొటన వేలితో గట్టిగా ప్రెస్ చేయండి. కొన్ని నిమిషాల పాటు రౌండ్ గా మసాజ్ చేయండి.


4. హార్ట్ 7 (HT7) : మణికట్టు అరచేతి వైపున, చేతి మణికట్టును కలిసే క్రీజ్ వద్ద, గట్టిగా ప్రెస్ చేయండి. కొన్ని నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ, సున్నితంగా ఒత్తిడిని కలిగించాలి.


5. షోల్డర్ వెల్ (GHB21) : భుజం పైభాగంలో, మెడ బేస్, భుజం చివర ఉంటుంది. మీ వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేసి రౌండా మసాజ్ చేయండి. కొన్ని నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ, సున్నితంగా ఒత్తిడిని కలిగించాలి.


6. హెవెన్లీ పిల్లర్ (B10) : వెన్నెముకకు ఇరువైపులా, పుర్రె దిగువన, ఒకదానికొకటి రెండు అంగుళాల దూరంలో ఈ పాయింట్ ఉంటుంది. మీ బొటనవేళ్లతో కొన్ని నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ, సున్నితంగా ఒత్తిడిని కలిగించాలి.


7. గ్రేట్ సర్జ్ (LV3) : పాదాల పైభాగంలో, బొటనవేలు, రెండవ వేలు మధ్య వెబ్‌బింగ్‌లో ఈ పాయింట్ ఉంటుంది. మీ బొటనవేళ్లతో కొన్ని నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ, సున్నితంగా ఒత్తిడిని కలిగించాలి.


8. ఇన్నర్ గేట్ (P6) :  మణికట్టు మడతపైన మూడు వేళ్ల వెడల్పుతో లోపల ఈ పాయింట్ ఉంటుంది. మీ బొటనవేళ్లతో కొన్ని నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ, సున్నితంగా ఒత్తిడిని కలిగించాలి.


9. అడ్రినల్ పాయింట్లు : వెన్నెముకకు ఇరువైపులా రెండు వేలి వెడల్పుల దూరంలో, దిగువ వీపు భాగంలో ఉంటాయి. మీ బొటనవేళ్లతో కొన్ని నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ, సున్నితంగా ఒత్తిడిని కలిగించాలి.


10. కామ్ స్పిరిట్ (HT7) : మణికట్టు అరచేతి వైపున, చేతి మణికట్టును కలిసే క్రీజ్ వద్ద, చిటికెన వేలికి అనుగుణంగా ఉంటుంది. మీ బొటనవేళ్లతో కొన్ని నిమిషాలు గుండ్రంగా తిప్పుతూ, సున్నితంగా ఒత్తిడిని కలిగించాలి.


గమనికి: ప్రెజర్ పాయింట్ స్టిమ్యులేషన్ ద్వారా కొందరు వ్యక్తులు ఆందోళన లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది  వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గమనించడం ముఖ్యం. మీరు తీవ్రమైన లేదా తరచుగా ఆందోళనను ఎదుర్కొంటుంటే వైద్యున్ని సంప్రదించండి.