Foods for High Blood Pressure : ఒత్తిడి, ఇతరత్ర కారణాల వల్ల చాలామందికి అధిక రక్తపోటు వస్తుంది. కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఇది గుండె సమస్యలు, ఇతర ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. అందుకే మెడిసన్స్ నుంచి.. తీసుకునే ఆహారం వరకు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. జీవనశైలిలో మార్పులతో పాటు.. ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. కొన్ని ఫుడ్స్ తీసుకోవడంతో పాటు.. కొన్ని ఫుడ్స్​ని దూరంగా పెట్టాలంటున్నారు.  


వ్యాయామం రెగ్యూలర్​గా చేయాలి..


అధిక రక్తపోటు ఉంటే ముందుగా మార్పు చేయాల్సింది జీవనశైలిలో. ఎందుకంటే మీరు ఫిట్​గా ఉంటే ఈ సమస్య మీకు ఇబ్బంది కలిగించదు. కాబట్టి రెగ్యూలర్​గా వ్యాయామం చేయాలి. అలాగే ధ్యానం, యోగా చేయడం వల్ల గుండె సమస్యలు దూరమవుతాయి. అలాగే పోషకాహారం కచ్చితంగా తీసుకోవాలంటున్నారు. అంతేకాకుండా కొన్ని ఫుడ్స్ తినకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇంతకీ ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే రక్తపోటు కంట్రోల్​లో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.


సిట్రస్ కలిగి ఫ్రూట్స్..


సిట్రస్ ఫ్రూట్స్​ని కచ్చితంగా మీ డైట్​లో చేర్చుకోవాలి. నిమ్మకాయలు, దానిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు వంటి సిట్రస్ కలిగి పండ్లు రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. వీటిలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర సమ్మేళనాలు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ద్రాక్షల్లో విటమిన్ సి, పెక్టిన్ ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని ఇతర ఆరోగ్య ప్రయోజనాలకోసం కూడా తీసుకోవచ్చు. పైగా సిట్రస్ జాతికి చెందిన అన్ని పండ్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. వీటిని సలాడ్స్​లో లేదా నేరుగా స్నాక్స్ మాదిరిగా తీసుకోవచ్చు. 


గుండె ఆరోగ్యానికి మంచివి..


సాల్మన్ వంటి చేపలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలోని ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్.. శరీరంలో మంటను తగ్గించి.. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఉసిరికాయల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మిల్లెట్స్​లో కూడా మెగ్నీషియం ఉంటుంది. ఇవి గుండె ప్రమాదాలను దూరం చేస్తాయి. అంతేకాకుండా రక్తపోటును అదుపులో ఉంచుతాయి. క్యారెట్లలో విటమిన్ సి ఉంటుంది. ఇవి నేరుగా కూడా తినొచ్చు. మంచి రుచిని అందించడంతో పాటు.. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. కాబట్టి వీటిని సలాడ్స్​గా, స్నాక్స్​గా తీసుకోవచ్చు. బీట్​రూట్​ను కూడా మీరు హెల్తీ స్నాక్​గా తీసుకోవచ్చు.


చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా..


యోగర్ట్​లో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. కాబట్టి దీనిని స్నాక్​గా తీసుకోవచ్చు. అవిసెగింజల్లో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపడంతో పాటు.. రక్తపోటును తగ్గించే పోషకాలతో నిండి ఉంటుంది. ఆకలిని కంట్రోల్​లో ఉంచి.. చెడు కొలెస్ట్రాల్​ శరీరంలో పెరగకుండా చేస్తుంది. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా.. దానిలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఉప్పు వేస్తే రుచి బాగుంటుంది కానీ.. ఇది అధికరక్తపోటు ఉన్నవారికే కాదు.. లేనివారికి కూడా ఇది ప్రమాదకరమే అంటున్నారు నిపుణులు. 


ఈ ఫుడ్స్​కి దూరంగా ఉండాలి..


దాల్చిన చెక్క, ఓట్​మీల్, వెల్లుల్లి, బ్రోకలీ, బీన్స్, పాలకూర, టమోటాలు, బంగాళదుంపలు, అరటిపండ్లను కూడా మీ డైట్​లో చేర్చుకోవచ్చు. డార్క్ చాక్లెట్​ కూడా హెల్తీ స్నాక్​గా చెప్పవచ్చు. రెడ్ మీట్, చక్కెర ఎక్కువ కలిగిన ఫుడ్స్, డిజెర్ట్స్, ఉప్పు ఎక్కువ కలిగిన ఫుడ్స్, జామ్​లు, జెల్లీలు వంటివాటికి దూరంగా ఉండాలంటున్నారు. ఇవి సమస్యను తగ్గించకపోగా.. రెట్టింపు చేసి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయంటున్నారు. 



సోడియం, అన్​ హెల్తీ ఫ్యాట్స్, పిండి పదార్థాలు రక్తపోటును ప్రేరేపిస్తాయి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్, తృణ ధాన్యాలు, లో ఫ్యాట్ మిల్క్ ప్రొడెక్ట్స్ దీనిని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి సోడియం తీసుకోవడం తగ్గించాలి. హైపర్ టెన్షన్​ను సహజంగా తగ్గించుకునేందుకు చికిత్స తీసుకోవడంతో పాటు.. కొన్ని ఫుడ్స్ రెగ్యూలర్​గా తీసుకోవాలి. పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు బీపీని కంట్రోల్ చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగపరుస్తాయి. లేదంటే.. అధిక రక్తపోటు అనేది గుండె సమస్యలను తీవ్రం చేస్తుంది. 


Also Read : నగ్నంగా నిద్రపోతే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయట.. ముఖ్యంగా మహిళలకు చాలా మంచిదట