Health Benefits of Sleeping without Clothes : రాత్రినిద్రకు వెళ్లేముందు శరీరంపై కంఫర్ట్​బుల్​గా ఉండే దుస్తులు వేసుకుంటాము. డే టైమ్​లో ఎంత ఫ్యాషన్​గా ముస్తాబైనా, ఎంత స్టైలిష్​గా ఉన్నా.. పడుకునే సమయంలో కంఫర్ట్​గా ఉండే బట్టలు వేసుకునే పడుకుంటాము. ఇది మంచి నిద్రను ఇస్తుందని నమ్ముతాము. కానీ అసలు దుస్తులే లేకుండా పడుకుంటే మంచి నిద్రతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఇది శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక, లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. 


మెరుగైన నిద్రకై.. 


మీకు నిద్ర విషయంలో కాంప్లికేషన్స్ ఉన్నాయా? నిద్ర త్వరగా రావట్లేదా? అయితే మీరు నగ్నంగా పడుకోవడం ప్రారంభించండి. ఇది మంచి నిద్రను అందిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి.. మెరుగైన నిద్రను ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కార్టిసాల్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు నియంత్రించి.. మెరుగైన నిద్రను అందిస్తుంది. క్రమంగా నిద్రనాణ్యతను పెంచుతుంది. 


ఒత్తిడిని తగ్గిస్తుంది..


చాలామంది ఒత్తిడి కారణంగా నిద్రకు దూరమవుతూ ఉంటారు. ఆఫీస్​లో, పర్సనల్​ లైఫ్​లో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు దానిని కంట్రోల్ చేసుకునేందుకు మీరు యోగాతో పాటు.. నగ్నంగా పడుకునేందుకు ప్రయత్నించండి. ఇది మీ శరీరానికి విశ్రాంతిని, సౌకర్యాన్ని అందిస్తుంది. ఆందోళనను కూడా తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గి.. మరుసటి రోజు ఉదయాన్నే మీరు రిఫ్రెష్​గా ఫీల్​ అవుతారు. 



హెల్తీ స్కిన్..


ఆరోగ్యానికే కాదు.. నగ్నంగా పడుకోవడం వల్ల అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. న్యూడ్​గా నిద్రపోవడం వల్ల చర్మానికి ఊపిరి ఆడుతుంది. తద్వార సహజంగా తేమను నివారిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా స్కిన్​ టోన్​ను కూడా పెంచుతుంది. పైగా మంచి నిద్ర వద్ధాప్యఛాయలను దూరం చేస్తుంది. 


ఆ సమస్యలు దూరమవుతాయి..


స్త్రీలు న్యూడ్​గా పడుకోవడం వల్ల యోని భాగానికి మంచిది అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల యోని దగ్గర కలిగే ఈస్ట్ ఇన్​ఫెక్షన్లను నివారించవచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా యోనికి సంబంధించిన ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయంటున్నారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా పీరియడ్స్ సమస్యలు ఉంటే అవి కూడా కంట్రోల్ అవుతాయంటున్నారు. ఇది పీరియడ్స్​ సమస్యలను దూరం చేయడంతో పాటు.. పీఎమ్​ఎస్ లక్షణాలను తగ్గిస్తుందని చెప్తున్నారు. 


భాగస్వామితో కలిసి నిద్రిస్తే.. 


నగ్నంగా మీరు భాగస్వామితో కూడా కలిసి పడుకోవచ్చు. ఇది రోమాన్స్​ను ప్రేరేపించి.. లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇద్దరికీ ప్రశాంతతను అందిస్తుందంటున్నారు. పైగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. పార్టనర్​తో కలిసి నగ్నంగా పడుకున్నప్పుడు శరీరానికి అవసరమైన ఆక్సిటోసిన్​ విడుదల అవుతుంది. ఇది మీ బంధాన్ని బలోపేతం చేస్తుంది. 


కంఫర్ట్​ మీ సొంతం.. 


నిద్రకు ఉపక్రమించే ముందు శరీరం మీద ఉండే దుస్తులు ఎంత కంఫర్ట్​ని ఇస్తాయో.. ఎలాంటి బట్టలు లేకుండా పడుకోవడం వల్ల అంతకంటే ఎక్కువ కంఫర్ట్​ ఇస్తుందని పలు అధ్యయనాలు కూడా నిరూపించాయి. ఇవి చికాకును దూరం చేసి.. సౌకర్యవంతంగా నిద్రను అందిస్తాయి. ఇన్ఫ్లమేషన్​ తగ్గుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు విడుదలై.. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. 


అయితే నగ్నంగా నిద్రించడం అనేది పూర్తిగా వ్యక్తిగత ప్రాధాన్యతే. మీ సౌకర్యం, సౌలభ్యం బట్టి దీనిని మీరు ట్రై చేయవచ్చు. మీకు సపరేట్​ రూమ్​ ఉంటే దీనిని మీరు ఎలాంటి అసౌకర్యం లేకుండా నిద్రపోవచ్చు. అలాగే మీ పార్టనర్​ దగ్గర మీరు న్యూడ్​ పడుకోవడం ఇష్టం లేకుంటే మీరు దీనికి దూరంగా ఉండొచ్చు. 


Also Read : గంట నిద్ర తక్కువైతే నాలుగు రోజులు ఎఫెక్ట్ ఉంటుందట.. మీరెన్ని గంటలు పడుకుంటున్నారు?