Japanese Tricks For Weight Loss : బరువు తగ్గడం(Weight Loss Tips), కొలెస్ట్రాల్​ను కంట్రోల్​లో ఉంచుకోవడం, ఫిట్​గా ఉండడం హెల్తీ లైఫ్(Healthy Life) కావాలనుకునే చాలామందికి ఇవే ముఖ్యమైన గోల్స్​. ఫిట్​గా ఉండాలనుకునే వారు ఆరోగ్యంగా బరువు తగ్గాలని చూస్తారు. దానికోసం ఫుడ్ కంట్రోల్.. డైట్​ ఫాలో అవ్వడం.. ముఖ్యంగా వ్యాయామం చేస్తారు. బరువు తగ్గడంలో సమతుల్యమైన డైట్, రోజూవారీ శారీరక వ్యాయామం కీలకం. కానీ ఈ బిజీ లైఫ్​లో వాటిని ఫాలో అయ్యేందుకు సమయమే దొరకదు. మీరు కూడా అలానే ఇబ్బంది పడుతున్నారా?


అయితే మీరు కొన్ని సింపుల్ జపనీస్ చిట్కాలను ఫాలో అయితే.. మీరు హెల్తీగా బరువు తగ్గడంతో పాటు.. మంచి శారీరక రూపాన్ని పొందవచ్చు. ఈ జపనీస్ చిట్కాలు ఏంటి కొత్తగా అనుకుంటున్నారా? కొన్ని ప్రత్యేక, ఆరోగ్యకరమైన రోటీన్​, చిన్న చిన్న వ్యాయామాలు కూడా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. జపనీస్(Japanese)​ ఫాలో అయ్యే ఈ చిట్కాలను మీ రెగ్యూలర్ లైఫ్​లో చేర్చుకుంటే.. మీరు కూడా సులువైన, ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గవచ్చు. ఇంతకీ బరువును తగ్గించే, అదుపులో ఉంచే చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఫుడ్ విషయంలో ఇది మరచిపోకండి..


బరువు తగ్గడంలో ఫుడ్ కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే జపనీస్ తమ ప్రతి భోజనానికి ముందు కూరగాయలు తీసుకోవడంపై ఎక్కువ దృష్టి పెడతారు. ఎందుకంటే అవి మీరు భోజనం మొదలుపెట్టే ముందే కడుపును నిండుగా చేస్తాయి. కాబట్టి మీరు రైస్​ తక్కువగా తీసుకుంటారు. పైగా కూరగాయలు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ.. బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా రైస్, రోటీలు మీరు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. పైగా ఖాళీ కడుపుతో కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. ఇవి ఇన్సులిన్ ద్రవ్యరాశి విడుదల కాకుండా బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. 


ఆహారం తీసుకునేప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్..


జపనీస్​ ఫాలో అయ్యే మరో అద్భుతమైన టెక్నిక్.. జీర్ణక్రియను వేగవంతం చేయడం. దీనికోసం వారు ఆరోగ్యకమైన అలవాట్లతో జీవక్రియను పునరుద్ధరించుకుంటారు. మెరుగైన జీర్ణక్రియ ఆరోగ్యానికే కాదు.. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి రోజులో రెండుసార్లు తీసుకునే మొత్తం ఆహారాన్ని నాలుగు భాగాలుగా చేసుకోవాలి. ఆహారాన్ని తక్కువ మోతాదులో.. ఎక్కువసార్లు తీసుకోవాలి. 


అంతేకాకుండా మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా దానిని బాగా నమిలి మింగాలి. చాలామంది ఆదారాబాదరాగా ఫుడ్ తినేస్తారు. టైమ్​ తక్కువగా ఉందనో.. లేదా టేస్టీగా ఉందనో.. ఎక్కువ తినేయాలన్న ఆత్రంతో ఎక్కువగా తింటారు. కానీ ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల మీ జీర్ణ ప్రక్రియ సులభతరం అవుతుంది. అంతేకాకుండా ఇది మీకు తృప్తిని అందించి.. నిండుగా ఉన్న ఫీల్​ ఇస్తుంది. తద్వారా మీరు తక్కువగా తింటారు.


అప్పుడు మాత్రం అస్సలు తాగొద్దు.. 


మీరు భోజనం చేసేప్పుడు మీరు మంచినీరు తాగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగించవచ్చు. నీళ్లు కడుపులో Phను సమతుల్యం చేస్తుంది. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో శరీరానికి చాలా కష్టతరం చేస్తుంది. అందుకే జపనీస్ తమ భోజన సమయంలో నీరు ఎక్కువగా తీసుకోరు. కేవలం నీరే కాదు ఎలాంటి కూల్​డ్రింక్స్ కూడా తీసుకోరు. దానికి బదులుగా ఫుడ్​తో పాటు.. వేడి వేడి సూప్స్ తీసుకుంటారు. ఇది మీరు హైడ్రెట్​గా ఉండడంలో సహాయం చేస్తుంది. ఇదే కాకుండా కాఫీ, టీలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. 


హాట్ బాత్స్​


నిజమే. హాట్ బాత్స్(Hot Baths) శరీరంలో మెరుగైన రక్తప్రసరణను, జీవక్రియను అందిస్తాయి. ఇవి ఈ రెండూ కూడా మీరు బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా.. వేడి నీరు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అందుకే జపనీస్ వీటికి అంత ప్రాముఖ్యతను ఇస్తారు. కనీసం 20 నుంచి 30 నిముషాలు హాట్ బాత్ తీసుకుంటారు. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇది మీకు మెరుగైన నిద్రను అందిస్తుంది. మంచి నిద్ర కూడా మీకు బరువును తగ్గించడంలో సహాయం చేస్తుంది. 


ఈ నాలుగు సింపుల్, ఎఫెక్టివ్​ చిట్కాలు మీరు బరువు తగ్గడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే మీరు కూడా ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయిపోండి. 


Also Read : చలికాలంలో స్ప్రౌట్స్​ను ఇలా తీసుకుంటే ఇంకా మంచిది