Rising Heart Attacks in Under-40: గుండెపోటు మరణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు, పెద్దవాళ్లు హార్ట్‌ఎటాక్‌తో మరణిస్తున్నారు. అయితే, ప్రస్తుత కాలంలో.. ఈ ముప్పు 40 ఏళ్ల లోపు వాళ్లకే ఎక్కువగా ఉందని చెప్తున్నారు డాక్టర్లు. దీనిపై ఈ మధ్యే వచ్చిన రిసెర్చ్‌లు ఆందోళనకర విషయాలు వెల్లడిస్తున్నాయి. తక్కువ ప్రమాదం అని భావించే వయసు వారిలోనే ఎక్కువగా గుండెపోటు రావడం గమనించామని వైద్యులు చెప్తున్నారు. అయితే, దీనికి కరోనా వ్యాక్సిన్ కారణం అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి హార్ట్‌ఎటాక్ రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
40 ఏళ్లలోపు వ్యక్తులకు రిస్క్..
యూకే హెల్త్‌కేర్‌కి చెందిన డాక్టర్ వేదాంత్ ఎ. గుప్త ఈ మధ్యే ఒక రిసెర్చ్ నిర్వహించారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఆ రిసెర్చ్‌ని రిలీజ్ చేసింది. 40 ఏళ్లలోపు వ్యక్తులలో గుండెపోటులు పెరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. సాధారణంగా ఈ వయసు వారికి తక్కువ ప్రమాదంగా భావిస్తారని, అలాంటిది వాళ్లలోనే రిస్క్ ఎక్కువగా ఉందని ఆయన తన రిసెర్చ్ ద్వారా చెప్పారు.
లక్షణాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం
ఈ రోజుల్లో చాలామంది గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తున్నారని డాక్టర్లు చెప్తున్నారు. అలా చేయడం అత్యంత ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. ఛాతిలో నొప్పి రావడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం, అలసట, అజీర్ణం లాంటి సమస్యలు తలెత్తినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అవే చాలా ప్రమాదకరం అని సూచిస్తున్నారు. అవి మామూలు సమస్యలే అని అనుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని డాక్టర్ గుప్తా చెప్పారు.
లైఫ్‌స్టైల్‌లో మార్పులు..
మనిషి రోజువారి జీవితంలో వచ్చిన మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణం అని డాక్టర్ చెప్పారు. ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్‌కి అలవాటు పడటం వల్ల గుండెపోటు రిస్క్ పెరుగుతోందని అన్నారు. రోజువారి జీవితంలో కనీసం ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒకే దగ్గర కూర్చోవడం లాంటి వాటివల్ల గుండెసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
నివారణ చర్యలు తప్పవు..
రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ ముప్పుని తగ్గించాలంటే నివారణ చర్యలు తప్పవని డాక్టర్ సూచిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచనల ప్రకారం.. ప్రతి మనిషి దాదాపు వారానికి 150 నిమిషాలపాటు కచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇక ఎప్పుడు, ఎవరికి, ఎలా మెడికల్ నీడ్ వస్తుందో తెలీదు కాబట్టి.. కచ్చితంగా ప్రతి ఒక్కరికి సీపీఆర్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వాలని అన్నారు. ఫిబ్రవరిని అమెరికన్ హార్ట్‌మంత్‌గా నిర్వహిస్తారు. కాబట్టి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: HPV వ్యాక్సిన్ కేవలం అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల్లో ఆ క్యాన్సర్ రాకుండా దీనిని తీసుకోవాలట