దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 1,94,720 కరోనా కేసులు నమోదయ్యాయి. 442 మంది వైరస్‌తో మృతి చెందారు. 60,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 3,46,30,536కు పెరిగింది.
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,868కి పెరిగింది. ఇందులో 1805 మంది రికవరయ్యారు.
ఒమిక్రాన్ కేసుల సంఖ్యలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 1281 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దిల్లీని దాటి రాజస్థాన్ రెండో స్థానానికి వచ్చింది. రాజస్థాన్‌లో 645 ఒమిక్రాన్ కేసులు ఉండగా దిల్లీలో 546 ఉన్నాయి.
చాలా రాష్ట్రాల్లో మంగళవారం కరోనా కేసులు పెరిగాయి. బంగాల్‌లో 21,098 మందికి కరోనా సోకింది. దీంతో మరోసారి రోజువారి కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. తమిళనాడులో 15,379 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో 9,066 కేసులు నమోదయ్యాయి.
పండుగ సీజన్ కావడంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని లేకుంటే మరో దారుణమైన కరోనా వేవ్ చూడాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వ్యాక్సినేషన్..
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 85,26,240 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,53,80,08,200కు చేరింది.
Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్‌డౌన్ విధిస్తారా?