Monsoon Fever | మండుటెండలు, చెమటలు, వేడి, ఉక్కపోత తరువాత భారత్‌లో వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాకాలం ఎండ వేడి నుండి ఎంత ఉపశమనాన్ని ఇస్తుందో, అదే స్థాయిలో  అనేక వ్యాధులను కూడా తీసుకొస్తుంది. వర్షాకాలం మొదలవ్వగానే చాలా ఇళ్లలో జ్వరం, జలుబు, దగ్గు బారిన పడే వారి సంఖ్య పెరుగుతుంది. ఈ వర్షాకాలంలో సీజనల్ జ్వరం రావడం అనేది చాలా సాధారణం. కొన్ని మందులు వాడుతూ, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది నయమవుతుంది. 

Continues below advertisement

కానీ ఈ సీజన్‌లో జ్వరం వచ్చిందంటే అది కేవలం సీజనల్ జ్వరమే అని భావించకూడదు. చాలా సార్లు ఇది డెంగ్యూ లేదా మలేరియా వంటి అనారోగ్య సమస్యల ప్రారంభ లక్షణాలను కూడా సూచించవచ్చు. వీటిని గుర్తించడం కొంచెం కష్టమని చెప్పాలి. ఇలాంటి సమయంలో మీకు ఏ జ్వరం వచ్చిందనే అవగాహన ఉంటే, సమయానికి చికిత్స ప్రారంభించాలి. 

నార్మల్ ఫీవర్ లక్షణాలు

Continues below advertisement

వర్షాకాలంలో వచ్చే సీజనల్ జ్వరం విషయానికి వస్తే, దీని ప్రారంభ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. మీకు ఒళ్లు నొప్పులు, సాధారణ దగ్గు, గొంతు నొప్పితో పాటు కాస్త అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో కేవలం సరైన విశ్రాంతి, మెడిసిన్, క్రమం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జ్వరం 2 నుంచి 3 రోజుల్లో అదే తగ్గుతుంది. అలాగే ఈ సమయంలో పేషెంట్‌కు ఆకలి తగ్గుతుంది. కళ్ల ముందు ఇష్టమైన పదార్థాలున్నా ఏమీ తినాలి అనిపించదు. ఈ లక్షణాలు మినహా సీజనల్ జ్వరంలో ఇతర ప్రత్యేక లక్షణాలు ఉండవు. కేవలం మంచి ఆహార అలవాట్లు, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. వానలో తడవకపోవడంతో పాటు క్రమం తప్పకుండా వేడి నీరు తాగుతూ ఉండాలి. జ్వరం ఉన్నప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. లేకపోతే నీరసం ఎక్కువై మరింత అనారోగ్యం బారిన పడతారు. 

Also Read: Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

డెంగ్యూ లక్షణాలను ఎలా గుర్తించాలిఒకవేళ డెంగ్యూ అయితే సాధారణ జ్వరం కంటే చాలా తీవ్రమైన జ్వరం ఉంటుంది. అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది. ఇందులో ఒళ్లు నొప్పులతో పాటు కీళ్లు, కండరాలలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. దీనిని గుర్తించడానికి సులువైన మార్గం ఏమిటంటే, ఈ వ్యాధి సమయంలో మీ శరీరంపై చిన్న చిన్న ఎరుపు రంగు మచ్చలు (దద్దుర్లు) వస్తాయి. అలాగే చిగుళ్లు లేదా ముక్కు నుండి రక్తం కారడం, విపరీతమైన నీరసం, వాంతులు లాంటి సమస్యలు కనిపిస్తాయి. జ్వరం 3 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉన్నా, ఏమాత్రం తగ్గకపోయినా, శరీర ఉష్ణోగ్రత పదే పదే విపరీతంగా పెరిగినా లేదా శరీరంపై మచ్చలు కనిపించినా డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. రక్త పరీక్షలో ప్లేట్‌లెట్స్ కౌంట్‌ తప్పనిసరిగా చెక్ చేయించాలి.

గమనిక (Disclaimer): పరిశోధనా అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. దీనిని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా మాత్రం భావించవద్దు. మీరు ఏదైనా కొత్త విధానాన్ని లేదా వ్యాయామం చేసేముందు, మెడిసిన్ తీసుకునే ముందు తప్పనిసరిగా సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.