How To Keep House Smelling Fresh | మన ఆరోగ్యం అనేది ఇంటి పరిశుభ్రతపై సైతం ఎంతో కొంత ఆధారపడి ఉంటుంది. ఇల్లు తుడిచి, శుభ్రం చేసిన తర్వాత, ఎక్కువసేపు తాజా సువాసన ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ ఇల్లు తుడిచిన కొన్ని నిమిషాల తర్వాత వాసన మాయమైతుంది. మీ ఇంట్లో కూడా ఇలా జరిగితే, ఖరీదైన రూమ్ ఫ్రెషనర్లు లేదా కెమికల్ క్లీనర్లు కొనాల్సిన అవసరం లేదు. ఒక చిన్న చిట్కా మీ ఇంట్లో ఎక్కువసేపు సువాసన ఉండేలా చేస్తుంది.

Continues below advertisement

ఈ సులభమైన చిట్కా కోసం ఎసెన్షియల్ ఆయిల్ మాత్రమే అవసరం ఉంటుంది. ఇల్లు తుడవడానికి గోరువెచ్చని నీళ్ల బకెట్‌లో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలపండి. ఆ తర్వాత ఆ నీటితో ఇల్లంతా శుభ్రంగా తుడవండి. నేల ఆరిపోయిన తర్వాత కూడా మీ ఫ్లోర్‌లో సహజమైన సువాసన ఎక్కువసేపు ఉంటుంది.

గోరువెచ్చని నీటితో ఇల్లు తుడవాలి

Continues below advertisement

మీరు చల్లని నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీటిని ఇంటిని తుడిచేందుకు ఉపయోగించాలి. అందులో మీరు వేసే ఎసెన్షియల్ ఆయిల్ సువాసన మరింత బాగా వ్యాపిస్తుంది. వేడి కారణంగా, దాని సువాసన గది మొత్తం వ్యాపిస్తుంది. నేల ఆరిపోయిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉంటుంది.

ఏ ఎసెన్షియల్ ఆయిల్ వాడాలి

ఇంటికి తాజా సువాసన ఇవ్వడానికి లావెండర్, లెమన్‌గ్రాస్, యూకలిప్టస్, ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్స్ మంచి ఎంపికలుగా భావిస్తారు. . వాటి సువాసన తీవ్రంగా కాకుండా సింపుల్‌గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆయిల్ డ్రాప్స్ వేయవలసిన అవసరం లేదని గుర్తుంచుకోండి. కొన్ని చుక్కలు వేస్తే గది మొత్తానికి సరిపోతాయి.

Also Read: Easy Breakfast Recipes: సింపుల్‌గా పది నిమిషాల్లో బ్యాచిలర్స్‌ చేసుకునే టిఫిన్స్‌ రెసిపీ లిస్ట్ ఇదే!

తుడిచే గుడ్డను ఎక్కువ తడి వద్దు 

తుడిచే గుడ్డ చాలా తడిగా ఉండకుండా చూసుకోవాలి. నీరు త్వరగా వ్యాపించి, ఎసెన్షియల్ ఆయిల్ ప్రభావం తగ్గుతుంది. అందువల్ల, తుడిచే గుడ్డను కొద్దిగా పిండి ఇల్లు తుడుచుకోవాలి. ఇది సువాసనను బాగా వ్యాప్తి చేసి ఎక్కువసేపు మీ ఫ్లోర్ సువాసునగా ఉంచుతుంది. 

బకెట్ నీట్‌గా ఉంచుకోవాలి

చాలా సార్లు ఇల్లు తుడువడానికి ఉపయోగించే బకెట్‌ పాతది, కాస్త మురికి పేరుకుపోయినవి వాడుతుంటారు. అలా చేయడం ద్వారా మురికి లేదా దుర్వాసన ఇంటిని పాడు చేస్తుంది. ప్రతిసారి ఉపయోగించే ముందు బకెట్‌ను బాగా కడిగిన తరువాతే ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్ అందులో కలపాలి. దాంతో సువాసన ఎక్కువ సేపు ఉంటుంది. 

శుభ్రం చేసిన తర్వాత కిటికీలు తెరవండి

ఇల్లు తుడిచిన తర్వాత కొన్ని నిమిషాల మీ ఇంటి కిటికీలు తెరిచి ఉంచాలి. తాజా గాలితో పాటు సువాసనను ఇల్లు మొత్తం సులభంగా వ్యాపింపజేస్తుంది. మీకు కొంచెం రిఫ్రెష్‌మెంట్ అనిపిస్తుంది. 

ఈ ఒక్క దానితో పెరగనున్న ప్రభావం 

నేల మీద దుర్వాసనను పూర్తిగా తొలగించాలంటే, తుడుచే నీటిలో ఒక టీస్పూన్ వైట్ వెనిగర్ కూడా కలపవచ్చు. ఇది నేలపై ఉన్న మొండి మరకలు, దుర్వాసన లేకుండా చేయడంలో సహాయపడుతుంది. తద్వారా ఎసెన్షియల్ ఆయిల్ సువాసన గతంలో వాడిన కెమికల్స్ కంటే ఎక్కువసేపు ఉంటుంది. అవసరమైతే  కొన్ని చుక్కల మైల్డ్ లిక్విడ్ సోప్ కలుపుకున్నా పరవాలేదు. అయితే నెలకోసారి కాకుండా మూడు రోజులకు ఓసారి, కనీసం వారానికి ఒకసారైనా తడి గుడ్డతో ఇల్లు తుడుచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.