PV Sindhu Breaks Title Drought In Tokyo: తెలుగు తేజం పీవీ సింధు అద్భుత విజ‌యం సాధించింది. ప్ర‌తిష్టాత్మ‌క జ‌పాన్ ఓపెన్ ను కైవ‌సం చేసుకుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అకానే య‌మ‌గూచిని 21-17, 21-17 తేడాతో వ‌రుస గేమ్ ల్లో చిత్తు చేసింది. నిజానికి గత రెండేళ్లుగా ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫామ్ పై, ఆమె కెరీర్ పై రకరకాల డౌట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సింధు మళ్లీ పాత ఫామ్ ను అందుకోవడానికి ఎంత టైమ్ పడుతుంది, అసలు బిగ్ టైటిల్స్ గెలవగలదా లేదా అనే డిస్కషన్స్ నడిచాయి. నిరంతర గాయాలు, మోడర్న్ గేమ్ లో వచ్చిన చేంజెస్, 2024 నుంచి సాగుతున్న టైటిల్ కరవు వల్ల డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ కెరీర్ క్లోజ్ అయిపోయిందని విమర్శకులు కామెంట్స్ చేశారు. అయితే ఆదివారం టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో 31 ఏళ్ల సింధు తన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో ఆ విమర్శలన్నింటికీ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది.

Continues below advertisement

Continues below advertisement

హోమ్ ఫేవరెట్ యామగూచికి షాక్..ఫైనల్ పోరులో సింధు తన పాత వింటేజ్ ఆటతీరును ప్రదర్శించింది. రా పవర్, టాక్టికల్ బ్రిలియన్స్, మెంటల్ స్ట్రెంత్ తో జపాన్ స్టార్, హోమ్ ఫేవరెట్ అకానె యామగూచిని వరుస గేమ్స్ లో  కంప్లీట్ గా డిస్మాంటల్ చేసింది. ఈ మెగా విక్టరీ సింధు కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ గా నిలిచింది. బ్యాడ్మింటన్ హిస్టరీలోనే ప్రతిష్టాత్మకమైన జపాన్ ఓపెన్ టైటిల్ ను గెలిచిన వెరీ ఫస్ట్ ఇండియన్ గా సింధు సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. సింధు లాస్ట్ టైమ్ 2024 లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో టైటిల్ గెలవగా, ఆ తర్వాత 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్ తర్వాత ఆమె కెరీర్ లో సాధించిన బిగ్గెస్ట్ సక్సెస్ ఇదే కావడం విశేషం.

ప్రెజర్ సిట్యుయేషన్ లో సింధు అగ్రెసివ్ గేమ్మ్యాచ్ స్టార్టింగ్ నుంచి సింధు తన హైట్ అడ్వాంటేజ్ ను పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటూ క్రాస్ కోర్ట్ డ్రాప్స్, ప్రెసిషన్ స్మాష్ ల కాంబినేషన్ తో యామగూచిని ఫుల్ గా డిస్టర్బ్ చేసింది. ఫస్ట్ గేమ్ చివర వరకు ఇద్దరి మధ్య పాయింట్ల వేట ఉత్కంఠభరితంగా సాగింది. అయితే అసలైన ప్రెజర్ పెరిగిన క్రూషియల్ టైమ్‌లో సింధు నెర్వ్స్ ఆఫ్ స్టీల్  ప్రదర్శించి వరుసగా కీ పాయింట్స్ సాధించి ఫస్ట్ గేమ్ ను 21-17 తో తన అకౌంట్ లో వేసుకుంది. వన్ గేమ్ లీడ్ లోకి వచ్చిన తర్వాత సింధు ఎక్కడా తన ఇంటెన్సిటీని, స్పీడ్ ను అస్సలు తగ్గించకుండా సెకండ్ గేమ్ లోనూ అదే అగ్రెసివ్ మైండ్‌సెట్ తో ఎటాక్ కంటిన్యూ చేసింది.

వరల్డ్ నంబర్ 3 పై చారిత్రాత్మక విజయం.. రెండో గేమ్ లో సింధు పెంచిన అగ్రెసివ్ స్పీడ్ కు ఎప్పుడూ కూల్ గా ఉండే యామగూచి తీవ్రమైన ప్రెజర్ లోకి వెళ్లి అన్‌ఫోర్స్ డ్ ఎర్రర్స్  చేసింది. సింధు కేవలం అటాకింగ్ లోనే కాకుండా డిఫెన్స్ లోనూ వండర్ ఫుల్ రెసిస్టెన్స్ చూపించింది. యామగూచి నెట్ గేమ్ ప్లాన్స్ ను ముందే ఊహించి రివర్స్ ప్రెజర్ బిల్డ్ చేసింది. టోక్యో క్రౌడ్ ఫుల్ గా సపోర్ట్ ఇవ్వడంతో లాస్ట్ లో యామగూచి కంబ్యాక్ ఇవ్వడానికి ట్రై చేసినా, సింధు మాత్రం అస్సలు తలవంచలేదు. తన ఐకానిక్ 2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్ నాటి క్లాసిక్ డిసిప్లిన్ ను చూపిస్తూ త‌ర్వాతి గేమ్ ను కూడా 21-17 తో క్లోజ్ చేసి హిస్టారికల్ విజయం సొంతం చేసుకుంది. వరల్డ్ నంబర్ 3 ప్లేయర్ ను ఆమె హోమ్ గ్రౌండ్ లోనే ఓడించడం ద్వారా తాను మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసానని బ్యాడ్మింటన్ వరల్డ్ కు సింధు ప‌వ‌ర్ పుల్ మెసేజ్ పంపిందని తెలుస్తోంది.