Brain Tumour With Mobile | మొబైల్ అతిగా మాట్లాడితే మెదడు పాడవ్వుతుందని, బ్రెయిన్ ట్యూమర్ వస్తుందని గతంలో కొన్ని అధ్యయనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించలేకపోయారు. మొబైల్ నుంచి వచ్చే రేడియో వేవ్స్ వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయనే భయం ఎన్నాళ్ల నుంచో ఉంది. తాగాజా 5G టెక్నాలజీ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. 


ఆక్స్‌ఫార్డ్ యూనివర్శిటీ నిపుణులు మాత్రం.. ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మొబైల్ వల్ల మెదడులో కణితి లేదా క్యాన్సర్ ఏర్పడుతుందని చెప్పడానికి ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా లేదని, మీరు బిందాస్‌గా మొబైల్ ఫోన్లో కబుర్లు చెప్పుకోవచ్చని చెప్పేశారు. మొబైల్ ఫోన్ మెదడుపై చూపించే చెడు ప్రభావాలపై జరిపిన అధ్యయనంలో అతిగా ఫోన్ మాట్లాడే మహిళలు, ఫోన్‌కు దూరంగా ఉండే మహిళలను పరీక్షించారు. ఇరువురిలో బ్రెయిన్ ట్యూమర్ రేట్ సమానంగా ఉన్నట్లు తేలింది.


ఈ స్టడీ టీమ్‌లో ఒకరైన కిర్‌స్టిన్ పిరీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ వాడకం వల్ల మెదడులో కణితి ప్రమాదం ఉండదని ప్రస్తుత ఆధారాలు వెల్లడిస్తున్నాయి. యూకేలో 50 ఏళ్లు పైబడిన 776,000 మంది మహిళల డేటాను పరిశీలించగా.. మొబైల్ ఫోన్ వినియోగం, క్యాన్సర్ వచ్చే అవకాశాలకు ఎటువంటి సంబంధం లేదని తేలింది. అధ్యయనంలో భాగంగా 2001లో ఒకసారి, 2011లో మరోసారి మహిళల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఫోన్ ఉపయోగించేవారు, వాడని వారిలో ఈ ఫలితాలు సమానంగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో చాలామందికి కుడి వైపు ఫోన్ పెట్టుకుని మాట్లాడటం అలవాటు. అయితే, ఆ వైపు కూడా మెదడులో ఎటువంటి మార్పులు కనిపించలేదు’’ అని వెల్లడించారు. 


Also Read: శృంగారం చేసినా, చేయకపోయినా వారానికి ఇన్ని సార్లు స్కలించాల్సిందే, లేకపోతే..


కానీ, ప్రతి రోజు గంటల తరబడి చాటింగ్, ఫోన్లు మాట్లాడే మొబైల్ వినియోగదారుల గురించి తగిన డేటా లభించలేదని పరిశోధకులు తెలిపారు. సాంకేతికత పెరగడం వల్ల ఇప్పటి ఫోన్లు సురక్షితమేనని వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌కు చెందిన డాక్టర్ జోచిమ్ షూజ్ మాట్లాడుతూ.. ‘‘మొబైల్ టెక్నాలజీలు ఎప్పటికప్పుడు మెరుగుపడుతున్నాయి. గతంతో పోల్చితే ఇప్పటి ఫోన్లతో ముప్పు తక్కువే’’ అని తెలిపారు. అయితే, ఇటీవల ఫోన్ల వాడకంగా బాగా పెరిగిన నేపథ్యంలో దాని వల్ల కలిగే అనర్థాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తుండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఈ అధ్యయనం ఎన్నో ఆందోళనలను దూరం చేస్తోందన్నారు. 


Also Read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు