కొన్ని విషయాల్లో అస్సలు సిగ్గు పడకూడదు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే.. ఈ బిజీ లైఫ్‌లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. కాబట్టి, ప్రతి విషయం తెలుసుకోవాలి. చాలామంది సెక్స్, స్వయంతృప్తి గురించి బయటకు మాట్లాడటం ఇష్టం ఉండదు. వాటి గురించి తెలుసుకోవాలనే ఆరాటం ఉన్నా.. తగిన సమాచారం లభించదు. దీంతో వారికి తెలియకుండానే అనేక రోగాలకు గురవ్వుతున్నారు. సెక్స్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ, అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెళ్లయిన జంటలు కూడా రోజు సెక్స్ చేయడానికి ఇష్టపడరు. దాని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వారిని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పురుషులు ప్రమాదకర ప్రోస్టేట్ క్యాన్సర్‌కు గురవ్వుతున్నారు. 


సెక్స్ లేదా స్వయంతృప్తి వల్ల పురుషులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్కలనం(స్ఖలనం) ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌ ముప్పు నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. సెక్స్ చేయడం సాధ్యం కాకపోయినా.. కనీసం హస్త ప్రయోగం ద్వారా వీర్యాన్ని బయటకు స్కలిస్తే ఆరోగ్యం లభిస్తుంది. స్కలనం వల్ల గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. బుర్రలోని టెన్షన్లు సైతం బయటకు పోతాయి. ఎంతో సంతృప్తి కూడా లభిస్తుంది. 


Also Read: ఇదో ‘కంపు’ పాము, ఇది చేసే పనేంటో తెలిస్తే నవ్వు ఆగదు


స్కలనం(Ejaculate) పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుదని ఓ అధ్యయనంలో తేలింది. ఇటీవల 31,925 మంది పురుషులను సర్వే చేసిన యూరోపియన్ యూరాలజీ ఎక్కువ వీర్యాన్ని స్కలించే పురుషులు ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. వీరిలో ఒక నెల వ్యవధిలో 21 సార్లు స్కలించిన పురుషులు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది. తక్కువ స్కలనం చేసిన వ్యక్తుల్లో కొందరిలో క్యాన్సర్ లక్షణాలు బయటపడినట్లు నిపుణులు తెలుసుకున్నారు. అయితే, మీరు కచ్చితంగా ఇదే సంఖ్యకు కట్టుబడి ఉండాలనే రూల్ లేదు. కానీ, వీలైనంత ఎక్కువ స్కలించడం మంచిదే. 


Also Read: ఈ మూడు ఆహారాలు వీర్యకణాల సంఖ్యను తగ్గిస్తాయి, హెచ్చరిస్తున్న అధ్యయనాలు
 

పై లెక్కను పక్కన పెడితే.. వారానికి ఒకసారి సెక్స్ చేసే జంటలు కూడా హ్యాపీగా ఉంటున్నాయని, ముఖ్యంగా పురుషులు ఆరోగ్యంగా ఉంటున్నారని నిపుణులు వెల్లడించారు. స్వయంతృప్తి కంటే సెక్స్ వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని, శరీరానికి మంచి వ్యాయమం లభించడమే కాకుండా పార్టనర్‌తో మంచి బాండ్ ఏర్పడి మానసికంగానూ ఉత్సాహంగా ఉంటారని చెప్పారు. స్కలనం ఒత్తిడి, నిరాశను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని తెలిపారు. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తపోటును తగ్గిస్తుందని అధ్యయనంలో పేర్కొన్నారు. స్కలనం సమయంలో విడుదలయ్యే హ్యాపీనెస్ హార్మోన్ ‘ఆక్సిటోసిన్’ వల్లే ఆ ఫీల్ కలుగుతుందట. ఇప్పటివరకు స్కలనం వల్ల పురుషుల ఆరోగ్యానికి ముప్పు అని ఏ అధ్యయనం చెప్పలేదు. వారానికి కనీసం 5 సార్లు హస్త ప్రయోగంతో వీర్యాన్ని స్కలించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని చెబుతున్నారు. అలాగని శృంగారాన్ని అస్సలు దూరం చేసుకోవద్దు. దేని లాభాలు దానికున్నాయ్.