కేరళలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ నమోదయ్యే కేసుల్లో సగానికి పైగా కేరళ నుంచే వెలుగుచూస్తున్నాయి.
కేరళలో కొత్తగా 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి. 215 మంది మరణించారు. మరో 20,271 మంది కరోనా నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 19.03%గా ఉంది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశ వ్యాప్తంగా గత మూడు నెలలుగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ఒక్క కేరళ రాష్ట్రం నుంచే వచ్చాయి. ఇది వైద్య శాఖ నిపుణులను, కేరళ ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కానీ కేరళలో మాత్రం కరోనా కొత్త కేసులు స్థిరంగా ఉన్నాయి. రోజూ 30 వేల కేసులు దగ్గర వస్తున్నాయి.
కర్ణాటకలో..
కర్ణాటకలో కొత్తగా 1,224 కరోనా కేసులు నమోదు కాగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,668 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
Also Read: E-Visa for Afghans: ఈ-వీసాపై మాత్రమే భారత్ లోకి ఎంట్రీ: హోంశాఖ
ఉత్తరాఖండ్ లో..
ఉత్తరాఖండ్ లో కొత్తగా 32 కరోనా కేసులు నమోదయ్యాయి. 22 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.